For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సహనం కోల్పోయి సహచరుడిపై చెయ్యెత్తిన బంగ్లా క్రికెటర్ (వీడియో)

Mushfiqur Rahim loses his cool at teammate Nasum Ahmed for interfering while catching

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్, మాజీ కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. మైదానంలో తన సహచరుడిపైనే చెయ్యెత్తాడు. కుడి చేతితో దాదాపు తన సహచరుడి ముఖం మీద కొట్టినంత పని చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా సముదాయించినా అతనిలో కోపం తగ్గలేదు. కానీ అతడి చేతిలో తిట్లు తిన్న ప్లేయర్‌ మాత్రం భయంతో బిక్కచచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ హల్‌చల్ చేస్తోంది. బంగ్లా దేశ్ సీనియర్ క్రికెట్ అయిన రహీమ్ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తంమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..

బంగ్లాదేశ్‌లో ‘బంగబంధు టీ20 కప్‌' పేరిట దేశవాళీ టోర్నీ నిర్వహిస్తున్నారు. దాదాపు 20 మ్యాచ్‌ల తర్వాత టాప్‌ ఫోర్ జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. అయితే సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో రహీమ్‌ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్‌ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. మ్యాచ్‌ జరుగుతుండగా బౌన్సర్‌ను ఆడే క్రమంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ అఫిఫ్‌ హొస్సేన్‌ కొట్టిన షాట్‌ అక్కడే గాల్లోకి లేచింది. కీపర్‌ రహీమ్, ఫైన్‌ లెగ్‌ ఫీల్డర్‌ నజుమ్‌ అహ్మద్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. బంతి చేజారే పరిస్థితి వచ్చింది. కానీ రహీమ్‌ తడబడుతూనే క్యాచ్‌ పట్టేశాడు. ఆ వెంటనే సహచరుడు నజుమ్‌ను అదే చేత్తో కొట్టబోయాడు.

రహీమ్.. సీనియర్ అనే గర్వమా..?

రహీమ్.. సీనియర్ అనే గర్వమా..?

రహీమ్‌ చర్యకు నజుమ్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉన్న నజుమ్‌ అందుకోవాలి. కానీ రహీమ్‌ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్‌ పట్టడం గమనార్హం. సీనియర్‌ ప్లేయర్‌ అయిన రహీమ్‌ ఓ జూనియర్‌ క్రికెటర్‌ పట్ల ఇలా ప్రవర్తించడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేకులు తప్పుబడుతున్నారు. సీనియర్ అనే గర్వమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా రహీమ్ ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని కామెంట్ చేస్తున్నారు.

కీలక మ్యాచ్ కావడంతోనే..

కీలక మ్యాచ్ కావడంతోనే..

ఒకవేళ ఈ క్యాచ్‌ చేజారి ఉంటే కథ వేరేలా ఉండేది. అందుకే కెప్టెన్‌ అంతలా ఆగ్రహానికి గురయ్యాడని ముష్పికర్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢాకా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ముష్పికర్‌ (43), యాసిర్‌ అలీ (54) గట్టెక్కించారు. ఇక చివరికంటా పోరాడిన బరిషల్‌ జట్టు 141 పరుగులకే ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Story first published: Tuesday, December 15, 2020, 8:44 [IST]
Other articles published on Dec 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+