Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తప్పు చేశా.. మళ్లీ రిపీట్ చేయను.. సహచర ఆటగాడిపై చెయ్యెత్తడంపై బంగ్లాదేశ్ క్రికెటర్ క్షమాపణలు

Mushfiqur Rahim apologizes to his fans and teammate Nasum Ahmed after losing his cool in Bangabandhu T20 Cup

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ తన తప్పును తెలుసుకున్నాడు. మైదానంలో సహనం కోల్పోయి సహచరుడిపై చెయ్యెత్తిన ముష్ఫికర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దాంతో తన తప్పును తెలుసుకున్న ఈ బంగ్లా మాజీ కెప్టెన్ క్షమాపణలు కోరాడు. తాను ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ చేయనని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

 ఏం జరిగిందంటే..?

ఏం జరిగిందంటే..?

బంగ్లాదేశ్‌లో ‘బంగబంధు టీ20 కప్‌' పేరిట దేశవాళీ టోర్నీ నిర్వహిస్తున్నారు. దాదాపు 20 మ్యాచ్‌ల తర్వాత టాప్‌ ఫోర్ జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. అయితే సోమవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో రహీమ్‌ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్‌ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. మ్యాచ్‌ జరుగుతుండగా బౌన్సర్‌ను ఆడే క్రమంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ అఫిఫ్‌ హొస్సేన్‌ కొట్టిన షాట్‌ అక్కడే గాల్లోకి లేచింది. కీపర్‌ రహీమ్, ఫైన్‌ లెగ్‌ ఫీల్డర్‌ నజుమ్‌ అహ్మద్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. బంతి చేజారే పరిస్థితి వచ్చింది. కానీ రహీమ్‌ తడబడుతూనే క్యాచ్‌ పట్టేశాడు. ఆ వెంటనే సహచరుడు నజుమ్‌ను అదే చేత్తో కొట్టబోయాడు.

రహీమ్‌పై ఆగ్రహం..

రహీమ్‌పై ఆగ్రహం..

రహీమ్‌ చర్యకు నజుమ్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉన్న నజుమ్‌ అందుకోవాలి. కానీ రహీమ్‌ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్‌ పట్టడం గమనార్హం. సీనియర్‌ ప్లేయర్‌ అయిన రహీమ్‌ ఓ జూనియర్‌ క్రికెటర్‌ పట్ల ఇలా ప్రవర్తించడంపై మాజీ క్రికెటర్లు, విశ్లేకులు తప్పుబట్టారు. సీనియర్ అనే గర్వమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అభిమానులు కూడా రహీమ్ ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని కామెంట్ చేశారు.

మ్యాచ్ ముగిసిన వెంటనే సారీ చెప్పా..

మ్యాచ్ ముగిసిన వెంటనే సారీ చెప్పా..

ఇక ఈ విమర్శల నేపథ్యంలో తన తప్పును తెలుసుకున్న రహీమ్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌తో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అలాగే మ్యాచ్ ముగిసిన వెంటనే నజుమ్‌కు సారీ చెప్పానని తెలిపాడు. ‘అందరికి నమస్కారం.. మొదటగా నా అభిమానులు, ప్రేక్షకులతో పాటు అందరికి క్షమాపణలు. నిన్న మైదానంలో నేను ప్రవర్తించిన తీరు ఏ మాత్రం అమోదయోగ్యం కాదు. మ్యాచ్ ముగిసిన వెంటనే నజుమ్‌కు క్షమాపణలు చెప్పా. భవిష్యత్తులో నా నుంచి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటా.'అని పేర్కొన్నాడు. దీనికి నజూమ్‌తో కలిసి దిగిన ఫొటోను జత చేశాడు.

Story first published: Tuesday, December 15, 2020, 12:09 [IST]
Other articles published on Dec 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+