Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ దేవుడు నాకు మరో జన్మనిచ్చాడు: ముషీర్ ఖాన్

తనకు దేవుడు మరో జన్మను ప్రసాదించాడని టీమిండియా యువ క్రికెటర్, ముంబై ప్లేయర్ ముషీర్ ఖాన్ అన్నాడు. ఆ దేవుడు దయ, అభిమానుల ప్రార్థనల వల్ల తన తండ్రితో పాటు తాను ప్రాణాలతో బయటపడ్డామని చెప్పాడు.

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు అయిన ముషీర్ ఖాన్.. శనివారం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే‌పై జరిగిన ఈ ప్రమాదంలో ముషీర్ ఖాన్ మెడకు గాయ‌మైంది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.

Musheer Khan first reaction after surviving car accident

ఇటీవల ముగిస దులీప్ ట్రోఫీలో భారీ శతకం బాది అందరి దృష్టిని ఆకర్షించిన ముషీర్ ఖాన్.. అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరిగే ఇరానీ కప్‌లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం ముంబై జట్టుతో పాటు లక్నో వెళ్లిన ముషీర్ ఖాన్.. వ్యక్తిగత పనుల కోసం తన స్వస్థలం అజమ్‌గఢ్‌‌కు వెళ్లాడు. తన తండ్రితో కలిసి లక్నో తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్ డివైడర్‌ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ముషీర్ ఖాన్ మెడకు తీవ్ర గాయం కాగా.. అతని తండ్రి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఈ అనూహ్య ఘటనతో ముషీర్ ఖాన్ సుమారు మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.

ఈ ఘోర ప్రమాదం నుంచి కోలుకుంటున్న ముషీర్ ఖాన్.. తన తండ్రితో కలిసి మాట్లాడిన ఓ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ దేవుడు తనకు పునర్జన్మను ప్రసాదించాడని తెలిపాడు.

'ముందుగా నాకు పునర్జన్మిచ్చిన ఆ అల్లాకు ధన్యవాదాలు. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. ఈ ప్రమాదంలో నాతో పాటు మా నాన్న కూడా ఉన్నాడు. అయన కూడా క్షేమంగా ఉన్నాడు. మీ ఆశీర్వాదాల వల్లే నాకు ఘోర ప్రమాదం తప్పింది. మీ అందరికి ధన్యవాదాలు.'అని ముషీర్ ఖాన్ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు.

అనంతరం ముషీర్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ మాట్లాడుతూ.. తమకు మరో జన్మనిచ్చిన దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా తమ క్షేమం కోరిన శ్రేయోభిలాషులు, చుట్టాలు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. ముషీర్‌కు వైద్య సహాయం అందిస్తున్న ముంబై క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాడు.

Story first published: Sunday, September 29, 2024, 21:34 [IST]
Other articles published on Sep 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+