విఫలమైనా సెహ్వాగ్‌కు అండగా నిలిచారు.. అలా మద్దతు ఇచ్చి ఉంటే..: మురళీ విజయ్

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా వెటరన్ బ్యాటర్ మురళీ విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇచ్చిన మద్దతు తనకు కూడా ఇచ్చి ఉంటే కెరీర్ మరోలా ఉండేదని తెలిపాడు. విదేశీ లీగ్స్ కోసం బీసీసీఐతో తెగదెంపులు చేసుకుంటున్నానని మురళీ విజయ్ ప్రకంటించిన విషయం తెలిసిందే. ఇక్కడ 30 ఏళ్లు ధాటితే 80 ఏళ్ల వృద్దుడిలా చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఓ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ విజయ్.. సెహ్వాగ్ విషయాన్ని ప్రస్తావించాడు.

సెహ్వాగ్‌లా మద్దతు ఇచ్చి ఉంటే..
సెహ్వాగ్‌కు దక్కిన మద్దతు తనకు దక్కలేదని, అలాంటి మద్దతు తనకు కూడా దక్కి ఉంటే కథ మరోలా ఉండేదని తెలిపాడు. 'వాస్తవంగా చెప్పాలంటే నా కెరీర్ లో నాకు డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు దక్కిన మద్దతు దక్కలేదు. సెహ్వాగ్‌కు టీమ్ మేనేజ్మెంట్ నుంచి అన్ని విధాలా మద్ధతు లభించింది. తన మాట చెల్లుబాటు అయ్యేది.
కానీ నాకు అలా కాదు. అలాంటి స్వేచ్ఛ గనుక నాకు దక్కి ఉంటే.. టీమ్‌లో నా మాట వినిపించుకునే వాళ్లు ఉండుంటే నా కెరీర్ మరో విధంగా ఉండేది. అంతర్జాతీయ కెరీర్ లో రాణించాలంటే టీమ్ మేనేజ్‌మెంట్ మద్దతు తప్పనసరి. కొన్నిసార్లు విఫలమైనా వరుస అవకాశాలు వస్తేనే ఆటలో ప్రయోగాలు చేసే వీలు చిక్కుతుంది.'అని చెప్పుకొచ్చాడు.

గొప్ప గౌరవం..
ఏదేమైనప్పటికీ సెహ్వాగ్‌తో కలిసి ఆడటం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని విజయ్ చెప్పుకొచ్చాడు. అతను అద్భతమైన ఆటగాడని కొనియాడాడు. 'సెహ్వాగ్ మరో ఎండ్ లో ఉన్నాడంటే తనతో బ్యాటింగ్ చేయడం కష్టమే. అతనిలా మరొకరు బ్యాటింగ్ చేయలేరేమో అనిపిస్తుంది.
టీమిండియాకు సెహ్వాగ్ ఎనలేని సేవలు చేశాడు. అతనితో కలిసి ఆడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. సెహ్వాగ్ సక్సెస్ మంత్ర చాలా సింపుల్. దొరికిన బంతిని దొరికనట్టుగా బాదడం. 145-150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బౌలర్ల బౌలింగ్‌లో హాయిగా పాటలు పాడుకుంటూ భారీ షాట్లు ఆడటం అనేది మాములు విషయం కాదు. ఇది మరెవరికీ సాధ్యం కాదు.' అని తెలిపాడు.

ఫారిన్ లీగ్స్ కోసం..
'బీసీసీఐతో దాదాపు నా బంధం ముగిసినట్లే. విదేశాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. మరికొంత కాలం ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. భారతదేశంలో 30 ఏళ్లు దాటిన వారిపై వివక్ష చూపిస్తారు. వాళ్లు మమ్మల్ని వీధిలో నడుస్తున్న 80 ఏళ్ల వృద్ధులుగా చూస్తారు. అయితే. నేను ఎలాంటి వివాదాలు చేయాలనుకోవడం లేదు. మీడియా కూడా దీన్ని భిన్నంగా చూడాలి.

2018లో చివరిసారిగా..
ప్రస్తుతం నేను సాధ్యమైనంత వరకు మంచి ఆటతీరును కనబరుస్తానని భావిస్తున్నా. కానీ, దురదృష్టవశాత్తు ఇక్కడ అవకాశాలు తక్కువగా ఉండడంతో బయట అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్తున్నాను. మన చేతిలో ఉన్నది మాత్రమే మనం చేయగలం. మన చేతిలో లేని వాటిని నియంత్రించలేం. తర్వాత ఏం జరగాల్సి ఉంటే అది జరుగుతుంది'అని మురళీ విజయ్ అన్నాడు.
ఇక 38 ఏళ్ల మురళీ విజయ్ భారత్ తరఫున చివరిసారిగా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆడాడు. టీమిండియా తరఫున ఇప్పటివరకు 61 టెస్టుల్లో 38.29 సగటుతో 3,982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 17 వన్డేలు ఆడిన మురళీ విజయ్.. 339 పరుగులు చేశాడు. 9 టీ20ల్లో 169 పరుగులు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications