Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జడేజా.. నా చెంప చెళ్లు మనిపిస్తాడేమో: మురళీ కార్తీక్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వయసు అయిపోయిందని, అతని స్థానాన్ని భర్తీ చేసే సత్తా మానవ్ సుతార్‌కు ఉందని మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలను వింటే జడేజా.. తన చెంప చెళ్లు మనిపిస్తాడేమోనని చమత్కరించాడు.

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. శనివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్ ఇద్దరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం యువ స్పిన్నర్లకు టీమిండియా అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మానవ్ సుతార్ అందిపుచ్చుకున్నాడు.

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

మానవ్ సుతార్ గొప్ప బౌలర్ అవుతాడు..

అఫ్గానిస్థాన్‌తో అరంగేట్ర మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌కు ముందు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వార్విక్‌షైర్ తరఫున ఆడాడు. శ్రీలంక ఎలెవన్‌తో జరిగిన మూడో రోజుల వామప్ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. తాజాగా అతని గురించి మాట్లాడిన మురళీ కార్తీక్.. గొప్ప బౌలర్ అవుతాడని జోస్యం చెప్పాడు.

Murali Karthik Says Ravindra Jadeja will punch me the next time he meets me ahead of Sri Lanka Tests

'మానవ్ సుతార్‌ను ఎవరితోనూ పోల్చవద్దు. అతను గొప్ప బౌలర్. అతను సాంప్రదాయ శైలిలో బౌలింగ్ చేస్తాడు. అతనిలో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కామెంటేటర్‌గా అతని ఆటను దగ్గరగా చూశాను. అతని బౌలింగ్ నన్ను బాగా ఆకట్టుకుంది. చాలా కచ్చితత్వంతో బంతిని స్పిన్ చేయగలుగుతున్నాడు. సరైన సమయంలో అతను భారత్‌కు దొరికిన గొప్ప ఆణిముత్యం.

కోహ్లీ కాదు.. కష్టకాలంలో ధోనీనే ఎంచుకుంటా: రవీంద్ర జడేజా

Also Read

కోహ్లీ కాదు.. కష్టకాలంలో ధోనీనే ఎంచుకుంటా: రవీంద్ర జడేజా

జడేజా కెరీర్‌ ముగిసింది..

ఈ మాటలు వింటే జడేజా నా చెంప చెళ్లమనిపిస్తాడేమో. కానీ అతను 37 ఏళ్లు వచ్చాయి. క్రికెటర్‌గా అతని కెరీర్‌ ముగిసిపోయింది. అతను ఇంకెంత కాలం ఆడుతాడో తెలియదు. ఇలాంటి తరుణంలో తర్వాతి తరానికి బాధ్యతలు అప్పగించడం గురించి ఆలోచించాలి.'అని మురళీ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

జడేజా ఇప్పటికే వైట్ బాల్‌ క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రవీంద్ర జడేజా వీడ్కోలు పలికాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆడిన 6 వన్డేల్లో ఒకే ఒక్క వికెట్ తీసాడు. దాంతో అతన్ని వన్డేల్లోకి ఎంపిక చేయడం లేదు.

శ్రీలంకతో వామప్ మ్యాచ్‌లో మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Wednesday, August 12, 2026, 22:02 [IST]
Other articles published on Aug 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+