Irani Cup 2024: 27 ఏళ్ల తర్వాత ముంబై విజయం!
ప్రతిష్టాత్మక ఇరానీ కప్ 2024లో ముంబై రంజీ టీమ్ విజేతగా నిలిచింది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్‌ను ముద్దాడింది. రెస్టాఫ్ ఇండియాతో లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే టోర్నీ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ముంబైని అంపైర్లు విజేతగా ప్రకటించారు.
డబుల్ సెంచరీతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్యా రహానే సారథ్యంలో ముంబై రంజీ ట్రోఫీని గెలవడంతో పాటు తాజాగా ఇరానీ కప్‌ను సొంతం చేసుకుంది.

153/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 329/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. లోయరార్డర్ బ్యాటర్ తనూష్ కోటియన్(150 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 114 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. మోహిత్ అవస్థి(93 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. పృథ్వీ షా(105 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 76) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(6/121) ఆరు వికెట్లు తీయగా.. మనవ్ సుతార్(2/78) రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి సెషన్‌లో ఫలితం తేలే ఆస్కారం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించారు. దాంతో రెస్టాఫ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఆడలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 141 ఓవర్లలో 537 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్(286 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్స్‌లతో 222 నాటౌట్) అజేయ ద్విశతకంతో రాణించగా.. తనూష్ కోటియన్(124 బంతుల్లో 6 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్(5/110) ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ దయాల్(2/89), ప్రసిధ్ కృష్ణ(2/102) రెండేసి వికెట్లు పడగొట్టారు. సరాన్ష్ జైస్(1/82)కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(292 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 191) తృటిలో ద్విశతకం చేజార్చుకోగా.. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(121 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 93) సెంచరీ అందుకోలేకపోయాడు. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ, తనూష్ కోటియన్ మూడేసి వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ జునేద్ ఖాన్ ఓ వికెట్ తీసాడు. దాంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
MUMBAI WON THE IRANI CUP AFTER 27 YEARS...!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2024
- Last time they won, that match was also played from 1st to 5th October. 🤯pic.twitter.com/sLrNIGjJ3l
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications