
178 పరుగుల విజయ లక్ష్యంతో
178 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 35 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు ఢిల్లీ బౌలర్ నవ్‌దీప్ సైని (3/53) ధాటికి 40 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

89 బంతుల్లో 71 పరుగులు చేసిన ఆదిత్య తారె
కీలక బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా(8), అజింక్య రహానే(10), శ్రేయస్ అయ్యర్ (7), సూర్యకుమార్ యాదవ్(4) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆదిత్య తారె (89 బంతుల్లో 71).. సిద్దేశ్ లాడ్ (48)తో కలిసి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.
గువహటి వన్డేలో పంత్ అరంగేట్రం: నాలుగో స్థానంలో అంబటి రాయుడు

ఐదో వికెట్‌కు 105 పరుగులు
వీళ్లిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. దీంతో ముంబై అలవోక విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పేసర్లు ధవల్ కులకర్ణి (3/30), శివమ్ దూబే (3/29) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 45.4 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది.

ఒకే ఒక్క పరుగు చేసిన గంభీర్
ఢిల్లీ జట్టులో 41 పరుగులు చేసిన హిమ్మత్ సింగే టాప్ స్కోరర్. కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఒక్క పరుగే చేశాడు. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ముంబై ఆటగాడు ఆదిత్య తరేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ముంబైకిది మూడో విజయ్ హజారె ట్రోఫీ. చివరగా ఆ జట్టు 2006-07లో టైటిల్ గెలిచింది.


Click it and Unblock the Notifications












