Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గువహటి వన్డేలో పంత్ అరంగేట్రం: నాలుగో స్థానంలో అంబటి రాయుడు

Team India

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. గువహటి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ హాఫ్‌లో మంచు పడుతుంది కాబట్టి తాము ముందు బౌలింగ్ చేస్తామని ఈ సందర్భంగా కోహ్లీ చెప్పాడు.

తమ బ్యాటింగ్ ఆర్డర్ బాగుందని, రాయుడు నాలుగో స్థానంలో వస్తాడని తెలిపాడు. అలాగే ఈ మ్యాచ్‌లో ముగ్గురు పాస్ట్ బౌలర్లు, ఒక చైనామన్ స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌తో బరిలోకి దిగుతున్నామని కోహ్లీ చెప్పాడు. అలాగే ఆల్ రౌండర్ జడేజా కూడా ఆడుతున్నాడని కోహ్లీ తెలిపాడు.

1
44266

ధోని చేతుల మీదుగా వన్డే క్యాప్‌ని అందుకున్న పంత్

మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. రిషబ్ పంత్‌ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేతుల మీదుగా తన వన్డే క్యాప్‌ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా రిషబ్ పంత్ ఆడనున్నాడు. కాగా, క్రికెట్ మైదానంలో 100 శాతం ఆటను ప్రదర్శించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని పంత్ అన్నాడు.

జాసన్ హోల్డర్ మాట్లాడుతూ

కాగా, ఈ పిచ్‌ మీద మొదట బ్యాటింగ్ చేయాలని తాను అనుకోలేదని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వెల్లడించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నారని చెప్పాడు. జట్టులో యువకులు అధికంగా ఉన్నారని, వారి ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నాడు. హేమ్‌రాజ్ ఓపెనింగ్ చేస్తాడని, ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లోకి ఓషానే థామస్ వచ్చాడని హోల్డర్ తెలిపాడు.

బర్సాపర మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే

ఈ మ్యాచ్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయమేంటంటే.. బర్సాపర మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు ఇప్పుడు ఐదు వన్డేల పోరుపై దృష్టి సారించింది. టెస్ట్ సిరీస్‌ కోల్పోయిన విండీస్.. వన్డేల్లో సత్తా చాటాలని చూస్తుండగా.. వన్డేల్లో అయినా గట్టి పోటీ ఇవ్వాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

ఐదో భారతీయ క్రికెటర్‌గా కోహ్లీ

ఈ వన్డే సిరిస్‌లో విరాట్‌ కోహ్లీ మరో 221 పరుగులు చేస్తే వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయి దాటిన ఐదో భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. సచిన్ ఈ ఫీట్‌ను 259 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. మరోవైపు గత నాలుగేళ్ల(2014) నుంచి భారత్‌పై వెస్టిండిస్ వన్డే సిరీస్ గెలువలేదు. ఈ సిరిస్‌‌లో మరో 177 పరుగులు చేస్తే 5000 పరుగులను అత్యంత వేగంగా సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధిస్తాడు.

జట్ల వివరాలు

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అంబటి రాయుడు, ఎం.ఎస్.ధోనీ(వికెట్ కీపర్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహల్

విండీస్ జట్టు: కీరన్ పావెల్, చంద్రపాల్ హేమ్‌రాజ్, షాయి హోమ్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మైర్, మార్లోన్ సామ్యూల్స్, రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్(కెప్టెన్), అష్లే నర్స్, దేవేంద్ర బిషూ, కెమర్ రోచ్, ఓషానే థామస్

Story first published: Sunday, October 21, 2018, 13:50 [IST]
Other articles published on Oct 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+