Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నీ కోచ్‌కే గతిలేదు.. నువ్వెంత? పిచ్చిగా వాగకు.. సర్ఫరాజ్‌ ఖాన్‌పై చీఫ్ సెలెక్టర్ ఫైర్!

Mumbai Selector Milind Rege Lashes Out At Sarfaraz Khan For His Non-selection Remarks

ముంబై: భారత జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. సెలెక్షన్ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తానూ మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ తనను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పి హ్యాండిచ్చాడని సర్ఫరాజ్ ఖాన్ ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కాగా.. మాజీ క్రికెటర్లు, అభిమానులు సర్ఫరాజ్‌కు అండగా నిలిచారు. అయితే ముంబై మాజీ కెప్టెన్, ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ మిలింద్ రేగె మాత్రం సర్ఫరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పిచ్చిగా మాట్లాడితే వచ్చేదేం లేదు..

పిచ్చిగా మాట్లాడితే వచ్చేదేం లేదు..

బ్యాట్స్‌మన్‌గా సర్ఫరాజ్ పని పరుగులు చేయడం వరకేనని, జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అన్నది అతని చేతుల్లో లేని అంశమని చెప్పాడు. తన చేతుల్లో లేనిదాని గురించి మాట్లాడటం అనవసరమని, ఈ పిచ్చి వ్యాఖ్యలకు బదులు బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు. 'ఆటను కొనసాగిస్తూ ఉండు. మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉండాలి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఇప్పటికైనా సర్ఫరాజ్‌ తన మాటలు వెనక్కి తీసుకోవాలి'అని మిడ్ డే చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిలింద్‌ రేగె సూచించాడు.

 టీమిండియాలో చోటు లేదు..

టీమిండియాలో చోటు లేదు..

ముంబై కోచ్‌ ప్రస్తుతం కోచ్ అమోల్‌ మజుందార్‌ కంటే సర్ఫరాజ్ గొప్ప బ్యాటర్ ఏం కాదని మండిపడ్డాడు.'సర్ఫరాజ్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌లో అతనికి చోటు లేదు. తాను అత్యద్భుతంగా ఆడుతున్నాడనేది నిజం. అయితే, ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. అప్పుడు తనను తాను నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడు జాతీయ జట్టులో అసలు చోటెక్కడిది? అయినా, ఈ విషయంలో సర్ఫరాజ్‌ వ్యాఖ్యలు సరికావు. తన దృష్టి బ్యాటింగ్‌పై మాత్రమే ఉండాలి.

 నీ కోచ్‌కే దిక్కు లేదు..

నీ కోచ్‌కే దిక్కు లేదు..

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 11 వేల పరుగులు సాధించిన అమోల్‌కు ఒక్కసారి కూడా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. అప్పటికి టీమిండియాలో చోటు లేకపోవడంతో తనకు నిరాశే ఎదురైంది. అయినా తను ఆటను కొనసాగించాడు. అమోల్‌ను చూసి సర్ఫరాజ్‌ నేర్చుకోవాల్సి ఉంది. అయినా, అమోల్‌ నీ కోచ్‌గా ఉండగా.. మీ నాన్నతో ఏం పని? ఆయన నీకు కోచింగ్‌ ఇస్తున్నారని ఓ పత్రికలో చదివా! అసలు ఆ వ్యవహారం ఏంటిది?'అని మిలింద్ అసహనం వ్యక్తం చేశాడు.

 వరుసగా రాణిస్తున్నా..

వరుసగా రాణిస్తున్నా..

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి రెండు టెస్ట్‌లకు చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే రంజీ ట్రోఫీలో వరుస సెంచరీలు బాదుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలెక్షన్ కమిటీ అతన్ని పట్టించుకోలేదు. పరిమిత ఓవర్ల ప్రదర్శన ఆధారంగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసింది. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ గత 23 ఇన్నింగ్స్‌ల్లో 10 శతకాలు నమోదు చేశాడు. అయినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం లేదు.

Story first published: Friday, January 20, 2023, 17:13 [IST]
Other articles published on Jan 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+