Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

VHT: ముంబై ఓపెనర్‌కు తీవ్ర గాయం.. ఆసుపత్రికి తరలింపు!

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరఖాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ అంగ్‌క్రిష్ రఘువంశీ తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా క్యాచ్ కోసం ప్రయత్నించి కింపడ్డాడు. దాంతో అతని మెడ భాగంలో తీవ్ర గాయమైంది. ఈ నొప్పితో విలవిలలాడిన రఘువంశీని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు.

గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అతని ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ(11), రోహిత్ శర్మ(0) తీవ్రంగా నిరాశపర్చినప్పటికీ.. ముషీర్ ఖాన్(55), సర్ఫరాజ్ ఖాన్(55), హార్దిక్ తోమర్(93) హాఫ్ సెంచరీలతో రాణించారు. షమ్సీ ములానీ(48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఉత్తరఖాండ్ బౌలర్లలో దేవంద్ర సింగ్ బోరా మూడు వికెట్లు తీయగా.. నాగర్‌కోటి, మయాంక్ మిశ్రా, సుచిత్, యువరాజ్ చౌదరి తలో వికెట్ తీసారు.

Mumbai s Angkrish Raghuvanshi Rushed to Jaipur Hospital After Suffering Nasty Injury

అనంతరం ఉత్తరఖాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులే చేసి ఓటమిపాలైంది. యువరాజ్ చౌదరి(96) సెంచరీ చేజార్చుకోగా.. జగదీష సుచిత్(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, తుక్రమ్ తార్మలే, ముషీర్ ఖాన్ రెండేసి వికెట్లు తీసారు.

Story first published: Friday, December 26, 2025, 18:25 [IST]
Other articles published on Dec 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+