
చెన్నై: టీమిండియా మాజీ వికెట్‌కీపర్, ముంబై ఇండియన్స్ వికెట్ కీపింగ్ కన్సల్టంట్ కిరణ్ మోరె కరోనా వైరస్ బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఈ భారత మాజీ వికెట్ కీపర్‌కు పాజిటివ్ వచ్చిందని ఆ ఫ్రాంచైజీ తెలిపింది. ప్రస్తుతం కిరణ్ మోరెకు ఎలాంటి లక్షణాలు లేవని, నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు తరలించామని వెల్లడించింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూపొందించిన ఆంక్షలు, నిబంధనలను తాము అత్యంత కఠినంగా అమలు చేస్తున్నామని ముంబై ఇండియన్స్ స్పష్టం చేసింది. తమ మెడికల్ టీమ్ మోరె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తుండటంతో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మోరె ముంబై ఇండియన్స్‌కు వికెట్ కీపింగ్‌లో మెలకువలు నేర్పించడమే కాకుండా ప్రతిభాన్వేషకుడిగా సేవలందిస్తుననారు.
ప్రస్తుత దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజుకు లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 24 గంటల్లో 40వేలకు పైగా కేసులు నమోదయ్యాడు. దీంతో అక్కడ రాత్రివేళ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. వారాంతాల్లో లాక్‌డౌన్ పెట్టారు. వాంఖడే మైదానం సిబ్బందికి కరోనా సోకుతుండటంతో ముంబైలో మ్యాచులు జరగడంపై ఇప్పటికీ అనుమానాలు నెలకొన్నాయి. కానీ బీసీసీఐ మాత్రం అక్కడే మ్యాచ్‌లు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.