Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

12 సిక్సర్లు, 16 ఫోర్లతో.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఊచకోత!

ముంబై ఇండియన్స్ ప్లేయర్ నమన్ ధీర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 12 సిక్సర్లు, 16 ఫోర్లతో బౌలర్లను ఊచకోత కోసాడు. పంజాబ్ వేదికగా జరుగుతున్న షేర్ ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో నమన్ ధీర్ 64 బంతుల్లో 173 పరుగులతో ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న నమన్ ధీర్.. మొహాలీ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

IPL 2027: ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టులోనే హార్దిక్ పాండ్యా! కోచ్, కెప్టెన్ ఎవరంటే?

IPL 2027: ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టులోనే హార్దిక్ పాండ్యా! కోచ్, కెప్టెన్ ఎవరంటే?

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నమన్ ధీర్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత దూకుడగా ఆడిన నమన్ ధీర్ డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఆఖరి ఓవర్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. నమన్ ధీర్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమృత్‌సర్ సూర్మాస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. జస్‌ప్రీత్ సింగ్(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) పర్వాలేదనిపించాడు.

Mumbai Indians Star Naman Dhir Smashes Stunning 173 Off 64 Balls in Sher-e-Punjab T20 League

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అభిషేక్ శర్మ(4 బంతుల్లో 2 సిక్స్‌లతో 13 పరుగులే చేసి వెనుదిరిగాడు. నమన్ ధీర్ ధాటికి మోహాలి కింగ్స్ బౌలర్లు ధారళంగా పరుగులిచ్చుకున్నారు. ఆయుష్ గోయల్(4/43) నాలుగు వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్, హర్ష్‌దీప్ సింగ్, తేజ్‌ప్రీత్ సింగ్ తలో వికెట్ తీసారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన మోహలి కింగ్స్ 87 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అన్మోల్ ప్రీత్ సింగ్(25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీ బాది వెనుదిరిగాడు.

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

Also Read

హార్దిక్‌ పాండ్యా‌ను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్

ఐపీఎల్‌లో నమన్ ధీర్.. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దాంతో ఆ జట్టు అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో మిడిలార్డర్‌లో ఆడే నమన్ ధీర్.. తాజా మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి విధ్వంసం సృష్టించాడు. దాంతో వచ్చే సీజన్‌లో అతన్ని ఓపెనర్‌గా ఆడించాలని ముంబై ఫ్యాన్స్ కోరుతున్నారు. రూ.5.25 కోట్ల ధరతో జట్టులో కొనసాగుతున్న నమన్ ధీర్.. ఐపీఎల్ 2026 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 26.50 సగటుతో 318 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Story first published: Tuesday, September 8, 2026, 16:11 [IST]
Other articles published on Sep 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+