Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mumbai Indiansకు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరం!

 Mumbai Indians: Rohit Sharma Out Of IPL 2021 For Inital Matches Due To Covid

హైదరాబాద్: 'ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది' ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పరిస్థితి. ఇంగ్లండ్ పర్యటనలోని భారత జట్టులో కరోనా కలకలం రేగడం.. ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ క్యాష్ రిచ్ లీగ్ మలిదశ మ్యాచ్‌లు ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్ కరోనా వైరస్ కారణంగానే రద్దయిన విషయం తెలిసిందే.

ఐదో టెస్ట్ ముందు టీమిండియా అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్‌ వైరస్ బారిన పడటం.. అతనికి రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ సన్నిహితంగా ఉన్నారు. దాంతో ఆఖరి టెస్ట్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ని కోరింది. ఇరు బోర్డుల పరస్పర అంగీకారంతో ఐదో టెస్ట్‌ను రద్దు చేశాయి. భవిష్యత్తులో మళ్లీ మ్యాచ్ నిర్వహిస్తామని పేర్కొన్నాయి.

రోహిత్ సన్నిహితంగా..

రోహిత్ సన్నిహితంగా..

ఇక కరోనా వైరస్ బారిన పడిన ఫిజియో యోగేష్ పర్మార్‌కు రోహిత్ శర్మ సన్నిహితంగా ఉండటం.. ముంబై జట్టు వర్గాలను కలవరపెడుతుంది. నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా వైరస్ బారిన పడగా అతనికి సన్నిహితంగా ఉన్న ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్‌లను కూడా ముందుస్తు చర్యల్లో భాగంగా ఐసోలేషన్‌కు తరలించారు.

కానీ ఆ తర్వాత ఈ ముగ్గురు కూడా వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు పర్మార్‌కు సన్నిహితంగా ఉన్న రోహిత్ శర్మ, పుజారా, జడేజా,షమీ, ఇషాంత్‌లు కూడా ఐసోలేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతరాత్రి నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌ల్లో అందరికి నెగటీవ్ వచ్చినప్పటికీ.. సాధారణంగా కరోనా లక్షణాలు మూడు, నాలుగు రోజు తర్వాత బయటపడతాయి.

ఐసోలేషన్‌లో ఉండాలంటే..

ఐసోలేషన్‌లో ఉండాలంటే..

ఐపీఎల్ సజావుగా సాగాలనే బీసీసీఐ.. ఐదో టెస్ట్ రద్దుకు మొగ్గు చూపింది. ఈ పరిస్థితుల్లో యోగేష్ పర్మార్‌కు సన్నిహితంగా ఉన్న రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాల పట్ల కూడా కఠినంగానే వ్యవహరించనుంది. వారిని 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలంటే మాత్రం రోహిత్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే ఫస్ట్ మ్యాచ్‌కు దూరంకానున్నాడు. జడేజాది కూడా అదే పరిస్థితి.

అయితే నాలుగో టెస్ట్‌లో మోకాలి గాయానికి గురైన రోహిత్ శర్మ.. యోగేష్ పర్మార్‌కు అత్యంత సన్నిహితంగా మెదిలాడు. వాస్తవానికి పుజారా, జడేజా, ఇషాంత్‌లు కూడా గాయాల నేపథ్యంలో పర్మార్‌కు సన్నిహితంగా ఉన్నారు. ముందుస్తు షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 14న ఆఖరి టెస్ట్ ముగిసిన తర్వాత 15న ఇంగ్లండ్ గడ్డపై ఉన్న ఆటగాళ్లు.. నేరుగా యూఏఈలోని తమ జట్ల ప్రాక్టీస్ క్యాంప్‌ల్లో కలవనున్నారు. కానీ భారత క్యాంప్‌లో కరోనా కలకలంతో పరిస్థితులన్నీ మారాయి.

కరోనా వస్తే..

కరోనా వస్తే..

ఒకవేళ యోగేష్ పర్మార్‌కు సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడితే మాత్రం పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి. వైరస్ బారిన పడితే దాదాపు ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌లకు దూరమైనట్లే. ఇప్పుడిదే ముంబై ఇండియన్స్ జట్టును, అభిమానులను కలవరపెడుతుంది. రోహిత్ గనుక పాజిటీవ్‌గా తేలితే.. అతను 10 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత ఐపీఎల్ ప్రొటోకాల్స్ ప్రకారం అన్నీ పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు సాధించాలి.

ఈ తతంగమంతా ముగిసే సరికి ఐపీఎల్ సెకండాఫ్ లీగ్ తుది దశకు చేరుకుంటుంది. ప్రాక్టీస్ ప్రారంభించి.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేవరకు లీగ్ మ్యాచ్‌లే పూర్తవుతాయి. ఇప్పుడిదే విషయం ముంబై ఇండియన్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌ను కలవరపెడుతుంది. రవీంద్ర జడేజా సైతం ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

నో క్లారిటీ..

నో క్లారిటీ..

కొవిడ్‌ నేపథ్యంలో ఐదో టెస్టులో భారత్‌ తుదిజట్టుని దింపలేకపోతోందని, వాకోవర్ ఇచ్చిందని ఈసీబీ తమ ప్రకటనలో తొలుత పేర్కొంది. దాంతో ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్ గెలిచినట్లు రాసుకొచ్చింది. కాసేపటి తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఈసీబీ తన ప్రకటనలో మార్పులు చేసింది. చివరికి ఈ మ్యాచ్‌ రద్దయినట్లుగా మాత్రమే పేర్కొంది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ప్రస్తుతం ఈ మ్యాచ్‌ జరగకపోయినా తర్వాత నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి. అయితే మ్యాచ్‌ పరిస్థితిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Story first published: Friday, September 10, 2021, 15:16 [IST]
Other articles published on Sep 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+