MI Probable Squad For IPL 2022: ముంబైలోకి దీపక్ చాహర్, జాసన్ హోల్డర్.. పూర్తి జట్టు ఇదే

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతున్న వేళ ఫ్రాంచైజీలన్నీ తమ వ్యూహాలను వేగవంతం చేశాయి. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే పక్కా లెక్కలను తయారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టోర్నీలో ఐదు సార్లు టైటిల్ గెలిచి లీగ్ బెస్ట్ టీమ్‌గా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్.. భవిష్యత్తులో కూడా అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. గత సీజన్ వరకు అత్యంత పటిష్టమైన కోర్ టీమ్ కలిగిన ఆ జట్టు.. మేగా వేలం కారణంగా చెల్లా చెదురైంది. దాంతో మెగా వేలంలో మళ్లీ తమ ఆటగాళ్లను తిరిగి తీసుకోవడంతో పాటు బలమైన కోర్ టీమ్‌ను సిద్దం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
రిటెన్షన్ ప్రక్రియలో రోహిత్ శర్మ(రూ.16 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ.8 కోట్లు), కీరన్ పొలార్డ్(రూ.6 కోట్లు)లను తీసుకున్న ముంబై రూ.42 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ.48 కోట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వేలంలో అచితూచి వ్యహరించాల్సిన అవసరం ఉంది. స్టార్ పేసర్ దీపక్ చాహర్, యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో పాటు ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను ఆ జట్టు తీసుకోవాలనుకుంటుంది. ముంబై టార్గెట్ చేసే ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా డికాక్, లూయిస్, మున్రో..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా ఓపెనింగ్ స్లాట్ కోసం మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్‌తో పాటు కొలిన్ మున్రోపై కన్నేసింది. డికాక్ కోసం భారీ ధర వెచ్చిచ్చేందుకు కూడా ఆర్‌సీబీ సిద్దంగా ఉంది. రిటెన్షన్ రూల్స్ ప్రకారం డికాక్‌ను వదులుకున్న ముంబై ఎలాగైన తిరిగి అతన్ని తీసుకోవాలనుకుంటుంది. బ్యాకప్‌గా ఎవిన్ లూయిన్, కొలిన్ మున్రోలను టార్గెట్ చేసింది. డికాక్‌ను తీసుకుంటే టీమ్‌కు వికెట్ కీపర్ సమస్య కూడా తీరనుంది.

మిడిలార్డర్ ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్, రహానే, సౌరభ్ తివారీ
మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. అతనికి తోడుగా యువ హిట్టర్, తమ మాజీ ప్లేయర్ ఇషాన్ కిషన్, సౌరభ్ తివారీలను తీసుకోవాలనుకుంటుంది. అలాగే బ్యాకప్ ఆప్షన్స్‌గా సీనియర్ ప్లేయర్లు దినేశ్ కార్తీక్, అజింక్యా రహానేలను టార్గెట్ చేసింది. వేలం డబ్బులు తక్కువగా ఉన్న నేపథ్యంలో తక్కువ ధర పలికే ఆటగాళ్లపై ముంబై కన్నేసింది.

ఆల్‌రౌండర్లుగా మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్..
కీరన్ పొలార్డ్ రూపంలో బెస్ట్ ఆల్‌రౌండర్‌ను జట్టులో ఉంచుకున్న ముంబై.. అతనికి తోడుగా మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్‌లను తీసుకోవాలనుకుంటుంది. ఈ ఇద్దరి ఒకరిని కచ్చితంగా కొనుగోలు చేయాలని భావిస్తోంది. భారత దేశవాళీ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాను కూడా ముంబై టార్గెట్ చేసింది. స్పిన్నర్లుగా మాజీ ప్లేయర్ రాహుల్ చాహర్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్, అశ్విన్‌లను టార్గెట్ చేసింది. దేశవాళీ స్పిన్నర్లనే తీసుకోవాలని భావిస్తోంది.

పేసర్లు దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, కగిసో రబడా
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను రిటైన్ చేసుకున్న ముంబై.. అతనికి తోడుగా మరో స్టార్ పేసర్‌ను తీసుకోవాలనుకుంటుంది. తమ మాజీ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌తో పాటు కగిసో రబడా, దీపక్ చాహర్‌లను టార్గెట్ చేసింది. అయితే ఈ ముగ్గురిలో ఒకరే ముంబైకి చిక్కే అవకాశం ఉంది. ట్రెంట్ బౌల్ట్ మినహా మిగతా బౌలర్లంతా భారీ ధర పలికే చాన్స్ ఉంది. దేశవాళీ స్టార్లు శివం మావి, ఇషాన్ పోరెల్‌ను కూడా ముంబై తీసుకునే చాన్స్ ఉంది.

ముంబై ఇండియన్స్ టీమ్ (అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, కీరన్ పొలార్డ్, దినేశ్ కార్తీక్(కీపర్), జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, శివమ్ మావి, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, అనుజ్ రావత్, క్రిస్ వోక్స్, దుష్మంత చమీరా, సూయశ్ ప్రభు దేశాయ్, ఇషాన్ పొరెల్, చరిత్ అసలంక, డేవిడ్ వైస్, ప్రెరక్ మన్కడ్, సంజయ్ యాదవ్, పెర్వెజ్ రసూల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications