For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2024: అతనిపై వేటు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. బుధవారం హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యం కారణంగా సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఆ తప్పిదాలను సవరించుకొని విజయం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.

Mumbai Indians Playing XI vs SRH IPL 2024 Akash Madhwal In and Luke Wood Out

అయితే హైదరాబాద్ పిచ్ ఫ్లాట్ వికెట్ కావడంతో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో బౌలింగ్ కాంబినేషన్‌లో స్వల్ప మార్పులు చేయవచ్చు. లూక్‌వుడ్‌పై వేటు వేసి ఆకాశ్ మధ్వాల్‌కు చోటిచ్చే ఛాన్స్ ఉంది. తద్వారా స్పిన్ ఆల్‌రౌండర్ అయిన మహమ్మద్ నబీని జట్టులోకి తీసుకోవచ్చు.

ఈ ఒక్కటి మినహా టీమ్ కాంబినేషన్‌లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు బరిలోకి దిగనున్నారు. తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ రాణించినా.. ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు. మిడిలార్డర్‌లో నమన్ ధీర్, తిలక్ వర్మతో పాటు టీమ్ డేవిడ్ బరిలోకి దిగనున్నారు.

హార్దిక్ పాండ్యా ఫినిషర్ పాత్ర పోషించనుండగా.. డెవాల్డ్ బ్రెవిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు గెరాల్డ్ కోయిట్జీ బరిలోకి దిగనున్నాడు. లూక్ వుడ్‌పై వేటు వేస్తే ఆకాశ్ మద్వాల్ జట్టులోకి రానున్నాడు. షామ్స్ ములాని స్థానంలో మహమ్మద్ నబీ బరిలోకి దిగవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా పియూష్ చావ్లా ఆడుతాడు.

ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా):
ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్(ఇంపాక్ట్), తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ కోయిట్జీ, షామ్స్ ములాని, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, లూక్ వుడ్

Story first published: Tuesday, March 26, 2024, 17:25 [IST]
Other articles published on Mar 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+