For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mumbai Indians Playing XI: జయంత్ యాదవ్ ఇన్.. రాహుల్ చాహర్‌ ఔట్.. రాజస్థాన్‌తో బరిలోకి దిగే ముంబై జట్టు ఇదే!

Mumbai Indians Playing 11 vs RR Match 51: Jayant Yadav In And Rahul Chahar Out For IPL 2021

హైదరాబాద్: ఐపీఎల్‌ 2021 సీజన్‌ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు చేసుకోగా.. మిగిలిన నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాల్లో నిలిచిన ముంబై ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్లు చావో రేవో మ్యాచ్‌కు సిద్దమయ్యాయి. మంగళవారం షార్జా వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు టోర్నీలో ముందడుగు వేసే అవకాశం ఉండగా.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

నిరాశలో గెలుపు కోసం..

నిరాశలో గెలుపు కోసం..

గతేడాది ఇదే యూఏఈ గడ్డపై దుమ్మురేపి టైటిల్ అందుకున్న ముంబై ఇండియన్స్ .. ఈ ఏడాది పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు లీగ్​లో 12 మ్యాచ్​లు ఆడిన రోహిత్​ సేన కేవలం 5 మ్యాచ్​ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఇక ప్లేఆఫ్స్​కు చేరాలంటే నేడు జరగబోయే మ్యాచ్​తో పాటు మరో పోరులోనూ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్​తో జరిగే మ్యాచ్​లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మెరుగవ్వాలని ముంబై భావిస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఎదురైన ఓటమితో జట్టులో పూర్తి నిరాశ నెలకొంది. దాంతో పాటు పేలవ ప్రదర్శన గత కొన్ని మ్యాచ్​ల్లో జట్టును వెంటాడుతోంది.

తుది జట్టులో మార్పుల్లేవ్..

తుది జట్టులో మార్పుల్లేవ్..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో బరిలోకి దిగినే జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. ఓపెనింగ్​ బ్యాట్స్​మెన్​ రోహిత్​ శర్మ, క్వింటన్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడుతూ మంచి శుభారంభాలందించాల్సిన అవసరం ఉంది. యూఏఈ గడ్డపై వరుసగా విఫలమైన సూర్యకుమార్​ యాదవ్​ గతమ్యాచ్​లో టచ్‌లోకి వచ్చాడు. మరీ అదే జోరును కొనసాగిస్తాడా? లేదా? అనేది చూడాలి.

ఆ తర్వాత మిడిల్​ ఆర్డర్​లో సౌరభ్​ తివారితో పాటు ఆల్​రౌండర్లు కీరన్ పొలార్డ్​, హార్దిక్​ పాండ్యా, కృనాల్​ పాండ్యాలు జట్టుకు అవసరమైన సమయంలో రాణించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా పొలార్డ్, హార్దిక్ పేలవ ఫామ్‌ జట్టును దెబ్బతీస్తోంది.

చాహర్‌కు నిరాశే..

చాహర్‌కు నిరాశే..

అటు బౌలింగ్​ లైనప్​లో బౌల్ట్​, కృనాల్​ పాండ్యా, బుమ్రా, కౌల్టర్​ నైల్ వికెట్లు తీస్తున్నా.. పరుగులు కట్టడి చేయలేకపోతున్నారు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో లెఫ్టాండర్స్ ఎక్కువగా ఉన్నారని, వ్యూహాత్మకంగా జయంత్ యాదవ్‌ను తీసుకున్న ముంబై.. ఈ మ్యాచ్‌లో కూడా అతన్నే కొనసాగించవచ్చు. రాజస్థాన్‌లో కూడా లెఫ్టాండర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అదే వ్యూహాన్ని అమలు చేయవచ్చు. దాంతో రాహుల్ చాహర్ మరోసారి డగౌట్‌కు పరిమితం కానున్నాడు.

రాజస్థాన్ జోరు కొనసాగించేనా?

రాజస్థాన్ జోరు కొనసాగించేనా?

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 12 మ్యాచ్​ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో.. ముంబై కంటే మెరుగైన రన్​రేట్​తో 6వ స్థానంలో నిలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబైని ఓడించి ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంది. పైగా గత మ్యాచ్‌లో పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. కొండంత లక్ష్యాన్ని విధ్యంసకర బ్యాటింగ్‌తో చేధించింది.

ఇదే జోరును ముంబైతో మ్యాచ్​లోనూ కొనసాగించాలని చూస్తోంది. రాజస్థాన్​ జట్టులో ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ లూయిస్​, జైశ్వాల్​ సహా మిడిల్​ ఆర్డర్​లో​ సంజూ శాంసన్​, శివమ్ దుబే, ఫిలిప్స్​ వంటి వారితో బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. మరోవైపు బౌలింగ్​ లైనప్​లో రాహుల్​ తెవాతియా తిరిగి ఫామ్​లోకి రాగా.. సకారియా, ముస్తఫిజుర్​ ఫర్వాలేదనిపిస్తున్నారు. .

తుదిజట్లు(అంచనా):

తుదిజట్లు(అంచనా):

ముంబై ఇండియన్స్​: రోహిత్​ శర్మ(కెప్టెన్​), క్వింటన్​ డికాక్(వికెట్​ కీపర్​), సూర్యకుమార్ యాదవ్​, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కిరన్​ పొలార్డ్, కౌల్టర్​ నైల్, జయంత్ యాదవ్, జస్​ప్రిత్​ బుమ్రా, ట్రెంట్​ బౌల్ట్.

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్​ కీపర్​), శివమ్​ దుబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాశ్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మన్.

Story first published: Tuesday, October 5, 2021, 10:20 [IST]
Other articles published on Oct 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+