Mumbai Indians Playing XI: హార్దిక్ ఇన్.. సౌరభ్ ఔట్.. ఆర్‌సీబీతో బరిలోకి దిగే ముంబై జట్టు ఇదే!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొన్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. నేడు(ఆదివారం) జరిగే డబుల్ హెడర్ సెకండ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఎదురైన పరాజయాలను మరిచి విజయాల బాట పట్టాలనుకుంటుంది. ఇక ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఆర్‌సీబీపై గెలవడం ముంబైకి అత్యవసరం. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉన్నముంబై.. మరో 5 మ్యాచ్‌ల్లో కచ్చితంగా నాలుగు గెలవాల్సిందే.
మరోవైపు ఆర్‌సీబీ పరిస్థితి కూడా ఇదే. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో అద్భుత విజయాలందుకున్న ఆర్‌సీబీ.. యూఏఈ గడ్డపై మాత్రం వరుసగా పరాజయాలు చవిచూసింది. దాంతో ఆ జట్టుకు కూడా ఈ మ్యాచ్ గెలవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే ఈ పోరు హోరాహోరీగా ఉండనుంది. పైగా ఫస్టాఫ్‌లో ముంబైపై కోహ్లీసేన థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేయాలనుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ బరిలోకి దిగే ముంబై జట్టుపై ఓ లుక్కెద్దాం.

హార్దిక్ పాండ్యా రెడీ.. సౌరభ్ ఔట్
గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఈ మ్యాచ్ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే అతని గాయంపై ముంబై టీమ్‌మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులో ఉంటాడని చెప్పింది. ఇక పాండ్యా జట్టులోకి వస్తే సౌరభ్ తివారీపై వేటు పడనుంది.
అయితే ఫస్టాఫ్‌లో, శ్రీలంక పర్యటనలో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా కీలక టీ20 ప్రపంచకప్ ముందు తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయడానికి హార్దిక్ సిద్దంగా ఉన్నాడని, అందుకే అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకున్నామని భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతను రానున్న మ్యాచ్‌ల్లో కచ్చితంగా బౌలింగ్ చేసి రాణించాల్సి ఉంటుంది. మరీ పాండ్యా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

ఓపెనర్లుగా రోహిత్, డికాక్..
ఇక సెకండాఫ్‌లో ఫస్ట్ మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ.. కేకేఆర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక తన ఫస్ట్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ తన సత్తా చాటాటు. 30 బంతుల్లో 33 పరుగులు చేసి ఫస్ట్ వికెట్‌కు డికాక్‌తో కలిసి 78 పరగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో ఈ జోడీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైన డికాక్.. కేకేఆర్ మ్యాచ్‌లో ఫామ్ అందుకున్నాడు. 42 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అతని బ్యాటింగ్‌లో కొంత వేగం తగ్గినా.. తదుపరి మ్యాచ్‌ల్లో రాణించగలడు. ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో ఈ జోడీ చెలరేగితే ముంబైకి తిరుగుండదు.

మిడిలార్డర్‌లో సూర్య, ఇషాన్ కిషన్..
రోహిత్-డికాక్ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నారు. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. వీరి వైఫల్యం ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రతీ మ్యాచ్‌లో నిలకడగా రాణించే సూర్య.. ఈ రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమ్యాడు. కీలక టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇలా నిరాశపరచడం అభిమానులను కలవరపెడుతుంది. ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో ఈ ఇద్దరు రాణించడం అటు భారత జట్టుకు ఇటు ముంబై ఇండియన్స్‌కు మంచిది.

ఆల్‌రౌండర్లు పొలార్డ్, హార్దిక్, కృనాల్..
ఇక హార్దిక్‌తో పాటు ఆల్‌రౌండర్లుగా పొలార్డ్, కృనాల్ పాండ్యా జట్టులోకి రానున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో పొలార్డ్, కృనాల్ విఫలమయ్యారు. పొలార్డ్ 15 బంతుల్లో 21 పరుగులే చేయగా.. కృనాల్ 9 బంతుల్లో 12 రన్స్ మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్ తీయలేదు. వీరి నిరాశజనక ప్రదర్శన ముంబై విజయవకాశాలను దెబ్బతీసింది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఈ ఇద్దరు సత్తా చాటాల్సిందే. ఈ ఇద్దరికి తోడుగా హార్దిక్ కూడా రాణిస్తే ముంబై భారీ స్కోర్ చేయడం ఖాయం. బౌలింగ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చినా ఆర్‌సీబీకి కష్టాలు తప్పవు.

బుమ్రా, మిల్నే, బౌల్ట్...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ మొదటి 10 ఓవర్లలో దుమ్మురేపిన ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా.. చివర్లో చేతులెత్తేశారు. ఇక కేకేఆర్ మ్యాచ్‌లోనూ దారళంగా పరుగులిచ్చుకొని మూల్యం చెల్లించుకున్నారు. బౌల్ట్, మిల్నే అయితే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసినప్పటికీ నాలుగు ఓవర్లలో 43 పరుగులిచ్చుకున్నాడు. పేసర్ల పేలవ ప్రదర్శన ముంబైని కలవరపెడుతుంది. అయితే ఆర్‌సీబీ మ్యాచ్‌లో కూడా ఈ ముగ్గురే బరిలోకి దిగనున్నారు. ఈ ముగ్గురు నుంచి ముంబై మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా/సౌరభ్ తివారీ, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications