Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: క్రిస్‌లిన్‌ ఔట్.. డికాక్ ఇన్! సీఎస్‌కేతో బరిలోకి దిగే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఇదే!

Mumbai Indians Playing 11 Vs CSK Match: Chris Lynn Out And De Kock In

హైదరాబాద్: ఐపీఎల్ 2021 మలిదశ లీగ్‌కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 19(ఆదివారం) రాత్రి 7.30 గంటలకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. భారత్ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా కారణంగా అర్దంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాంతో మలిదశ మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లు చేసింది.

ఇక రెండో దశ లీగ్‌లో ఫస్ట్ మ్యాచ్ రెండు బలమైన జట్ల మధ్యే జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా పుణ్యమా వచ్చిన ఈ లాంగ్ గ్యాప్‌లో అన్ని జట్లలో మార్పులు జరగ్గా.. ముంబై ఇండియన్స్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఏ ఆటగాడు దూరమవ్వలేదు. దాంతో ఆ జట్టు కాంబినేషన్‌పై ఎలాంటి ప్రభావం లేదు. సీఎస్‌కేతో బరిలోకి దిగే ముంబై తుది జట్టుపై ఓ లుక్కెద్దాం.

డికాక్ ఆగేయా..

డికాక్ ఆగేయా..

ఇక సౌతాఫ్రికా-శ్రీలంక పరిమిత ఓవర్ల సిరీస్‌ల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఆరంభం మ్యాచ్‌లకు క్వింటన్ డికాక్ దూరమవుతాడని అంతా భావించారు. కానీ బీసీసీఐ సీపీఎల్, సౌతాఫ్రికా-శ్రీలంక సిరీస్‌ల నుంచి వచ్చే ఆటగాళ్ల క్వారంటైన్ సమయాన్ని రెండు రోజులకే కుదించడంతో డికాక్ ఫస్ట్ మ్యాచ్ ఆడటం ఖాయమైపోయింది. ఇప్పటికే యూఏఈ చేరిన అతను క్వారంటైన్ పాటిస్తున్నాడు.

శ్రీలంకతో దుమ్మురేపిన అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. దాంతో ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఉన్న ఆసీస్ హిట్టర్ క్రిస్ లిన్‌కు మళ్లీ మొండి చెయ్యే ఎదురుకానుంది. ఇక ఇంగ్లండ్ గడ్డపై మొకాలి గాయానికి గురైన రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. క్వారంటైన్‌లోనే తేలికపాటి ఎక్సర్‌సైజులతో ట్రైనింగ్ షురూ చేశాడు.

సూర్య, ఇషాన్..

సూర్య, ఇషాన్..

రోహిత్, డికాక్ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నారు. ఫస్టాఫ్‌లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మన్ దుమ్మురేపారు. 7 ఇన్నింగ్స్‌ల్లో 144 స్ట్రైక్‌రేట్‌తో సూర్య.. 173 పరుగులు చేయగా.. ఇషాన్ 5 మ్యాచ్‌ల్లో 73 రన్స్ చేశాడు. ఇటీవల అతను మంచి ఫామ్‌లో ఉండటం.. ధాటిగా ఆడగలిగే సామర్థ్యం అతనికి అవకాశం వచ్చేలా చేయనుంది.

వికెట్ కీపర్‌గా డికాక్ ఉన్నప్పటికీ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. ఫస్టాఫ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఫామ్ కోల్పోయినా.. క్షణాల్లో మ్యాచ్‌ను మలుపుతిప్పగల హార్దిక్ సామర్థ్యం అతన్ని జట్టులోకి తీసుకునేలా చేస్తోంది. ఫస్టాఫ్‌లో ఈ స్టార్ ఆల్‌రౌండర్ 6 ఇన్నింగ్స్‌ల్లో 52 రన్స్ మాత్రమే చేశాడు. యూఏఈ గడ్డపై అతను రాణించడం అటు ముంబై ఇండియన్స్‌తో పాటు ప్రపంచకప్ ముందు భారత జట్టుకు కీలకం.

పొలార్డ్ మరోసారి..

పొలార్డ్ మరోసారి..

ఇక జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి ముందుండి నిలబడి చిరస్మరణీయ విజయాలందించే ప్లేయర్ కీరన్ పొలార్డ్. టీమ్ వైస్ కెప్టెన్ కూడా. ఇక ఫస్టాఫ్‌లో పొలార్డ్ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌తోనే జరిగిన మ్యాచ్‌లో ఓటమి ముంగిట నిలిచిన జట్టును విధ్వంసకర బ్యాటింగ్‌తో గెలిపించాడు.

ఆ మ్యాచ్‌లో పొలార్డ్ 87 పరుగులు బాదాడు. ఓవరాల్‌గా ఏడు మ్యాచ్‌ల్లో 171 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో 168 రన్స్ చేశాడు. పైగా అతను ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి ఫించ్ హిట్టర్‌గా జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. ఆ తర్వాత కృనాల్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు. స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ల్లో కృనాల్ పాండ్యాతో పాటు రాహుల్ చాహర్‌లు ముంబై ఇండియన్స్‌కు కీలకం కానున్నారు. గత సీజన్‌లో ఈ ఇద్దరూ యూఏఈ గడ్డపై అదరగొట్టారు.

బుమ్రా సారథ్యంలో..

బుమ్రా సారథ్యంలో..

ఇక జస్‌ప్రీత్ బుమ్రా పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. అతనితో పాటు ట్రెంట్ బౌల్ట్, మార్క్ జాన్‌సెన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా గతేడాది యూఏఈ గడ్డపై రాణించారు. వారి బౌలింగ్ శైలికి అక్కడి పిచ్‌లు సరిగ్గా సూటవుతాయి. ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే మార్క్ జాన్‌సెన్, స్పిన్నర్ కావాలనుకుంటే పియూష్ చావ్లా లేదా జయంత్ యాదవ్‌లకు అవకాశం దక్కవచ్చు.

ముంబై తుది జట్టు: (అంచనా)

ముంబై తుది జట్టు: (అంచనా)

క్వింటన్ డికాక్ (కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మార్కో జాన్‌సెన్

Story first published: Thursday, September 16, 2021, 15:38 [IST]
Other articles published on Sep 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+