For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mumbai Indians: వైరల్ ఫొటోలు.. బీచ్‌లో కుటుంబ సభ్యులతో ముంబై ఆటగాళ్ల సందడి!!

Mumbai Indians players Rohit Sharma, Jasprit Bumrah enjoy the sun and the sand in Abu Dhabi

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని ప్రాంఛైజీలు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా దాదాపు పది రోజులే ఉండడంతో అన్ని జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. సెప్టెంబర్‌ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో ముంబై సాధన మరింత తీవ్రతరం చేసింది. ఆటగాళ్లు నెట్ సెషన్‌లో కష్టపడుతున్నారు. అంతేకాదు విరామం దొరికినప్పుడు సరదాగా గడుపుతున్నారు.

కుటుంబ సభ్యులతో ఎంజాయ్

దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కాస్త విరామం దొరకడంతో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు బీచ్‌లో సరదాగా గడిపారు. రోహిత్‌ శర్మ, ఆదిత్య థారే, ధావల్‌ కులకర్ణి, సూర్య కుమార్‌ యాదవ్‌ తదితర ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి బీచ్‌లో ఎంజాయ్‌ చేశారు. రోహిత్, కులకర్ణి తమ కూతుళ్లతో సముద్ర తీరాన ఆడలాడుకున్నారు. రోహిత్ కూతురు ఇసుకలో ఎంజాయ్ చేసింది.

బుమ్రా ఒక్కడే

బుమ్రా ఒక్కడే

ముంబై ఆటగాళ్లు బీచ్‌లో కూడా సామాజిక దూరం పాటిస్తూనే ఫుట్‌బాల్‌, సముద్ర జలాలతో ఆటలు ఆడారు. ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ సేదతీరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ముంబై ఇండియన్స్‌ జట్టు ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. రోహిత్ వీడియోను పంచుకుంటూ 'మధురమైన ఫ్యామిలీ క్షణాలు' అని కాప్షన్ పెట్టింది. బీచ్‌లో ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.

ప్రత్యేకమైన ఉంగరాలు

ప్రత్యేకమైన ఉంగరాలు

ముంబై ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయమై ఆ ఫ్రాంఛైజీ గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైన ఉంగరాలు అందించింది. అందరూ కచ్చితంగా వాటిని ధరించాల్సి ఉంటుంది. దాంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, కరోనా లక్షణాలు లేకుండా వైరస్‌ బారిన పడినా శరీరంలో చోటుచేసుకునే మార్పులను గమనించి వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వీలు కలుగుతుంది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి:

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి:

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్‌ జట్టు సెప్టెంబర్‌ 19న అబుదాబి వేదికగా జరగబోయే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో తలపడనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో ఏకంగా నాలుగు సార్లు ఈ జట్టు ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈసారి కూడా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉంది.

కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఈసారి పక్కాగా కప్ గెలుస్తుంది: నీషమ్‌

Story first published: Wednesday, September 9, 2020, 15:23 [IST]
Other articles published on Sep 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+