
తెరపైకి కొత్త వాదన..
చెత్త బ్యాటింగ్, బౌలింగే కారణమని కొందరంటే.. టాస్ ఓడిపోవడం కొంపముంచిందని మరికొందరు అంటున్నారు. అంతేకాకుండా బీసీసీఐ కాసుల కక్కుర్తి కూడా టీమిండియాకు నష్టం చేసిందని, తీరిక లేని షెడ్యూల్ ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీసిందంటున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ భారత్ జట్టును దెబ్బతీసిందని కూడా చెబుతున్నారు.
కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తవ్వడం కూడా కోహ్లీసేన పతనాన్ని శాసించిందని పేర్కొంటున్నారు. అయితే ఇవే కాకుండా ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. జట్టులోని ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల దారుణ వైఫల్యం టీమ్ ఓటమికి ప్రధాన కారణమని కొంతమంది అభిమానులు వాదిస్తున్నారు.

ఐపీఎల్‌లో విఫలమైనా..
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్‌లతో జట్టులో సగానికి ఎక్కువ ముంబై ఆటగాళ్లే ఉన్నారని, వారు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో వీరి దారుణ వైఫల్యం టీమ్ ఫలితంపై ప్రభావం చూపిందంటున్నారు.
ఈ ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో దారుణంగా విఫలమయ్యారని, అందుకే ముంబై కనీసం ప్లే ఆఫ్స్ చేరలేదని, అయినా వారిని జట్టుకు ఎంపిక చేసి బీసీసీఐ మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఇక వారన్నట్లుగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ముంబై ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు.

రెండు మ్యాచ్‌ల్లో
ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అవ్వడం భారత జట్టు పతనాన్ని శాసించింది. తొలి ఓవర్‌లోనే అతను ఔటవ్వడంతో ఇతర ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు వికెట్లు పారేసుకున్నారు. దాంతో భారీ స్కోర్ చేయలేని భారత్.. పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది.
ముంబై ఇండియన్స్ ఆటగాడైన ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించి మూల్యం చెల్లించుకుంది. అతను కూడా ఆరంభంలోనే చేతులెత్తేయడంతో.. భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టి కనీస స్కోర్ చేయలేకపోయింది.


Click it and Unblock the Notifications












