For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రెంట్ బౌల్ట్ ట్రెండ్ సెట్టింగ్ క్యాచ్.. ఒంటి చేత్తో సూపర్ మ్యాన్‌లా.. చూస్తే వావ్ అనాల్సిందే!(వీడియో)

Mumbai Indians Player Trent Boult pulls off a one-handed screamer to send Liton Das back

వెల్లింగ్టన్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ మ్యాన్‌లా ఒంటి చేత్తో బంతిని అందుకొని ఔరా అనిపించాడు. అతని ఫీల్డింగ్ విన్యాసానికి మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు, కామెంటేటర్లు బిత్తరపోయారు. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ట్రెంట్ బౌల్ట్ ట్రెండ్ సెట్టింగ్ క్యాచ్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తూరు. అతని సూపర్ డూపర్ ఫీల్డింగ్‌కు ఫిదా అవుతున్నారు. 32 ఏళ్ల బౌల్ట్ ఫీల్డింగ్‌పై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఐపీఎల్‌లో బౌల్ట్ ముంబైకి ఆడుతున్న విషయం తెలిసిందే.

ఇంతకేం జరిగిందంటే..

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఈ స్టన్నింగ్స్ క్యాచ్ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ ఆఖరి బంతిని మాట్ హెన్రీ ఔట్ సైడ్ ఆఫ్ షార్ట్ బాల్‌గా సంధించగా.. బంగ్లా బ్యాట్స్‌మన్ లిటన్ దాస్ లెగ్‌సైడ్ పుల్ షాట్ ఆడబోయాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని సూపర్ డైవ్‌తో ఒంటిచేత్తో అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో లిటన్ దాస్(21) నిరాశగా పెవిలియన్ చేరాడు.

చెలరేగిన మిచెల్, కాన్‌వే..

చెలరేగిన మిచెల్, కాన్‌వే..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. బంగ్లా ముందు 319 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. డేవన్ కాన్వే(110 బంతుల్లో 17 ఫోర్లతో 126), డార్లీ మిచెల్(92 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100 నాటౌట్) శతకాలతో చెలరేగారు. 120 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును.. 159 పరుగుల భారీ భాగస్వామ్యంతో గట్టెక్కించి భారీ స్కోర్‌లో కీలక పాత్ర పోషించారు. దాంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 318 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో రుబెల్ హుస్సేన్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, టస్కిన్ అహ్మద్, సౌమ్య సర్కార్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

ఓటమి అంచున బంగ్లా..

ఓటమి అంచున బంగ్లా..

ఇక 319 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. మహ్మదుల్లా(35 బ్యాటింగ్) పోరాడుతుండగా.. లిటన్ దాస్(21), ముస్తాఫికర్ రెహ్మాన్(21)తో సహా అంతా విఫలమయ్యారు. మ్యాన్ హెన్రీ ఇప్పటికే 4 వికెట్లు ఖాతాలో వేసుకోగా.. జేమ్స్ నీషమ్ 3, కైల్ జేమీసన్ ఓ వికెట్ తీశారు. బంగ్లా విజాయానికి ఇంకా 200కు పైగా పరుగులు చేయాల్సి ఉండగా.. కివీస్ రెండు వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటికే ఈ మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న కివీస్.. ఈ గెలుపుతో క్లీన్ స్వీప్ చేయనుంది.

Story first published: Friday, March 26, 2021, 11:06 [IST]
Other articles published on Mar 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+