Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mumbai Indians: ఐపీఎల్ ప్రత్యర్థి కంటే.. వాతావరణమే అసలు సమస్య: స్టార్ పేసర్

Mumbai Indians pacer Trent Boult said biggest challenge will be to adjust to UAE conditions

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని ప్రత్యర్థి కంటే.. యూఏఈలోని వాతావరణంతోనే అసలు సమస్య అని ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, న్యూజిలాండ్‌ ఆటగాడు ట్రెంట్‌ బౌల్ట్ అన్నాడు. ఇలాంటి చోట బౌలింగ్‌ చేయడం అంత సులువు కాదని అతను అభిప్రాయపడ్డాడు. యూఏఈలో ప్రస్తుతం సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. న్యూజిలాండ్‌లో ప్రస్తుతం శీతాకాలం కాబట్టి 7-8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.

 వాతావరణమే అసలు సమస్య:

వాతావరణమే అసలు సమస్య:

ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ట్రెంట్‌ బౌల్ట్ మాట్లాడుతూ... 'యూఏఈలో ఉష్ణోగ్రతలకు అలవాటు పడటమే కొంత ఇబ్బందిగా మారింది. అది అంత సులువు కాదు. అయితే ప్రాక్టీస్‌ మాత్రం బాగానే జరుగుతోంది. ముంబై తరఫున ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇందులో చాలా మందికి మంచి అనుభవం ఉండటం జట్టు పనిని సులువు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన పలువురు ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్టులో బౌలర్‌గా ఉండటం నాకు సానుకూలాంశం. ఇక్కడి పిచ్‌లు బాగుండాలని కోరుకుంటున్నా. అప్పుడు బౌలర్‌గా సత్తా చాటేందుకు మంచి అవకాశం లభిస్తుంది' అని అన్నాడు.

శారీరకంగా సిద్ధం కావాలి:

శారీరకంగా సిద్ధం కావాలి:

ఇంతకు ముందు దుబయ్‌లో ఆడిన అనుభవం తనకు ఉందన్న ట్రెంట్ బౌల్ట్‌.. ఈ విషయంలో కంగారు పడకుండా శారీరకంగా సిద్ధం కావాలన్నాడు. తాను కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ లసిత్‌ మలింగ గైర్హాజరులో ప్రధాన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్‌పై మరింత బాధ్యత పెరిగింది. మరో నాలుగు రోజుల్లోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 19న అబుదాబీ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.

 వికెట్లు విరగ్గొడుతున్న బోల్ట్:

వికెట్లు విరగ్గొడుతున్న బోల్ట్:

శనివారమే తొలి మ్యాచ్ ఉండడంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్‌ కోచ్ మహేల జయవర్ధనే పర్యవేక్షణలో ఆ జట్టు ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. జయవర్థనే పర్యవేక్షణలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ తనలోని మొత్తం శక్తిసామర్థ్యాలను వెలికి తీస్తున్నాడు. నెట్స్‌లో ఫుల్ స్టీమ్‌తో బంతులు విసురుతూ చెమటోడ్చుతున్నాడు. ఈ క్రమంలో విసిరిన ఓ బంతికి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయ్యింది.

బౌల్ట్‌పై భారీ ఆశలు:

బౌల్ట్‌పై భారీ ఆశలు:

జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లతో ముంబై ఇండియన్స్ జట్టు పటిష్టంగా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో మలింగ ఈ ఏడాది టోర్నీకి దూరం కావడంతో ముంబై జట్టు.. ట్రెంట్ బౌల్ట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. బౌల్ట్‌ యూఏఈ పిప్‌లపై చెలరేగే అవకాశం ఉంది. పేస్, స్వింగే బోల్ట్ బలం. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లో ఉంది. ఐదోసారి ఛాంపియన్స్‌గా నిలిచి తమకు తిరుగులేదని చాటిచెప్పాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టు చూస్తోంది.

'ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి ఎంఎస్ ధోనీ.. అతనితో కలిసి ఆడటం కన్నా ఇంకేం కావాలి'

Story first published: Tuesday, September 15, 2020, 10:00 [IST]
Other articles published on Sep 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+