
అంతకన్నా ఇంకేం కావాలి:
తాజాగా పీయూష్ చావ్లా ఫస్ట్‌పోస్ట్‌తో మాట్లాడుతూ... 'ఒక కెప్టెన్ మిమ్మల్ని విశ్వసిస్తుంటే.. అంతకన్నా ఇంకేం కావాలి. మా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఏం అవసరమో తెలుసు. ఒక లెగ్ స్పిన్నర్‌కు మంచి కెప్టెన్ కావాలి. నాకు ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి ఎంఎస్ ధోనీ ఉన్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి. చాలా ఏళ్ల తర్వాత మహీతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. ఈసారి వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అందుకు కారణం నాపై మహీకి ఉన్న నమ్మకమే' అని చెప్పాడు.

అందుకే చెన్నై కొనుగోలు చేసింది:
2007, 2011లో టీమిండియా ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో పీయూష్ చావ్లా కూడా ఒక ఆటగాడిగా ఉన్నాడు. దీంతో చావ్లా లక్కీ ఆటగాడనే ఎంఎస్ ధోనీ తన జట్టులోకి తీసుకున్నాడా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని చెప్పాడు. ఆ రెండు ప్రపంచకప్ జట్లలో తనతో పాటు మరో 8 మంది ఉన్నారని, కాబట్టి తానొక్కడినే ఆ విజయాలు సాధించలేదని స్పష్టం చేశాడు. తాను ఎలా ఆడుతాను.. ఎంత కష్టపడుతున్నాననే విషయాల ఆధారంగానే తనని చెన్నై కొనుగోలు చేసిందని చావ్లా పేర్కొన్నాడు.

గంభీర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు:
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని, చెన్నై జట్టులో ఎంఎస్ ధోనీ అలాగే చేస్తాడని పీయూష్ చావ్లా అన్నాడు. టీమిండియాలో మహీ కెప్టెన్సీలో ఆడినందున అప్పుడూ బౌలర్లకు సహకరించేవాడని, అవసరమైతే తప్ప అతడు కలగజేసుకోడన్నాడు. కావాలనుకుంటే మహీ వికెట్ల వెనుక నుంచే సలహాలిస్తాడని పేర్కొన్నాడు. చెన్నై తరఫున వంద శాతం మంచి ప్రదర్శన చేస్తానని టీమిండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ ధీమా వ్యక్తం చేశాడు.

చావ్లాకి టాస్క్:
గతంలో ప్రాక్టీస్ సమయంలో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. పీయూష్ చావ్లాకి ఓ టాస్క్ ఇచ్చాడు. 'బంతిని డిఫెన్స్ చేయడానికి నీకు అనుమతి లేదు. ప్రతి బంతినీ స్టేడియం బయటికి కొట్టాలి' అని చావ్లాతో ధోనీ చెప్పాడు. ఆ పక్కనే రైనా కూడా ఉన్నాడు. 'నీలా బంతిని కొట్టలేను మహీ.. కానీ ట్రై చేస్తా' అని చావ్లా అన్నాడు. కొన్ని బంతుల తర్వాత చావ్లా బంతిని బలంగా బాదాడు.
Royal Challengers Bangalore కథ మారేనా.. జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!!


Click it and Unblock the Notifications
