Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mumbai Indians గ్రూప్‌లోకి రెండు కొత్త జట్లు.. పేర్లు ప్రకటించిన నీతా అంబాని

Mumbai Indians owners unveil names of their franchises in the UAE, South African T20 league

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఇతర టీ20 లీగ్‌ల్లో కొనుగోలు చేసిన రెండు జట్లకు నామకరణం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్.. యూఏఈ క్రికెట్ లీగ్‌తో పాటు సౌతాఫ్రికా క్రికెట్‌ లీగ్‌లో ఫ్రాంచైజీలు కొనుగోలు చేసింది. ఈ రెండు జట్లకు ముంబై ఇండియన్స్ బ్రాండ్ ప్రతిబింబించే పేర్లను పెట్టింది. యూఏఈ లీగ్‌లో కొనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ఎంఐ ఎమిరేట్స్( MI Emirates), సౌతాఫ్రికాలో కోనుగోలు చేసిన ఫ్రాంచైజీకి ఎంఐ కేప్‌టౌన్( MI Cape Town)నామకరణం చేసింది.

ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో ప్రకటించింది. ఎంఐ కుటుంబంలోకి ఈ రెండు జట్లకు స్వాగతం పలుకుతున్నామనే క్యాప్షన్‌తో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఫ్రాంచైజీల పేర్లతో పాటు అదే జెర్సీలను ఆటగాళ్లు ధరించనున్నారని స్పష్టం చేసింది. ముంబై ఇండియన్స్ జెర్సీ బ్లూ, గోల్డ్ లతో కలగలిసిన దుస్తులే యూఏఈ, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్‌లలో కొనసాగించనున్నారు.

ఈ ప్రకటనలో కొత్త జట్లను ఉద్దేశించి నీతా అంబానీ మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. 'మా #Onefamilyలోకి సరికొత్త ఫ్రాంచైజీలు ఎంఐ ఎమిరేట్స్' & ' ఎంఐ కేప్ టౌన్'ను స్వాగతించడం చాలా సంతోషాన్నిస్తున్నది. ఎంఐతో మాకు క్రికెట్‌కు మించిన అనుబంధం ఉంది. ఇక మా తాజా ఫ్రాంచైజీలు ఒకే నైతికితను స్వీకరిస్తాయి. ఎంఐ స్థాయిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని నేను కచ్చితంగా భావిస్తున్నా.' అని ఆ ప్రకటనలో పేర్కొంది.

సౌతాఫ్రికా క్రికెట్‌ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన జోహన్నెస్ బర్గ్ ఫ్రాంచైజీకి జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్‌గా ఆ జట్టు నామకరణం చేసింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

Story first published: Wednesday, August 10, 2022, 15:50 [IST]
Other articles published on Aug 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+