ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. ట్రేడ్ రూమర్స్‌కి అంబానీ టీమ్ చెక్!
హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్‌కి ముంబై ఇండియన్స్ చెక్ పెట్టింది. క్రేజీ పోస్ట్‌తో హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఐపీఎల్ 2027 సీజన్ ముందు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ వీడేందుకు సిద్దమయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. హార్దిక్ పాండ్యా కోసం ఇతర జట్లు ట్రేడ్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ బుధవారం క్రేజ్ పోస్ట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. హార్దిక్ పాండ్యా ఫొటోలతో 'Memo: Maki it HP Coded'అనే క్యాప్షన్‌ను పేర్కొంది. ఈ పోస్ట్ ద్వారా ట్రేడ్ రూమర్స్‌ను ముంబై ఇండియన్స్ కొట్టిపారేసింది. తమ కెప్టెన్‌ను మరే జట్టుకు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
హాట్ టాపిక్‌గా హార్దిక్ పాండ్యా ట్రేడ్ వార్తలు..
గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యా ట్రేడ్ వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఆసక్తి చూపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌లోకి తిరిగి వెళ్లేందుకు హార్దిక్ పాండ్యా ప్రయత్నించాడని, కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వలేదని చెప్పడంతో వెనకడుగు వేసాడని కూడా ప్రచారం జరిగింది. ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పాండ్యాను అడ్డుపెట్టుకొని తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ట్రేడ్ డీల్ చేస్తుందని మాజీ క్రికెటర్ అశ్విన్ తెలిపాడు.

అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవంలేదని ముంబై ఇండియన్స్ తాజా పోస్ట్‌తో స్పష్టం చేసింది. వాస్తవానికి ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా ట్రేడ్ వార్తలను ముంబై ఇండియన్స్ కొట్టిపారేసింది. హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని, కేవలం కల్పిత వార్తలేనని పేర్కొంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2027 సీజన్ ఆడుతుందని పేర్కొంది.
హార్దిక్‌కు మరో అవకాశం..
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ట్రేడ్ డీల్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించడంతో పాటు వరుసగా రెండోసారి ఫైనల్ చేర్చడంతో అతని కెప్టెన్సీ స్కిల్స్‌పై ముంబై నమ్మకం ఉంచింది. జట్టు భవిష్యత్తు కోసం హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నామని పేర్కొంది. అయితే రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం అభిమానులకు నచ్చలేదు.
సీనియర్ ఆటగాళ్ల సహకారం కూడా హార్దిక్‌కు కొరవడటంతో ముంబై ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. దాంతో ఆ జట్టు నుంచి తప్పుకోవాలని హార్దిక్ పాండ్యా భావించాడని వార్తలు వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ అతన్ని వదులుకోవడానికి సిద్దంగా లేదని తెలుస్తోంది. మరోసారి అతనిపై నమ్మకం ఉంచాలని భావిస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌లోనైనా ముంబై విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
