న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 auction: ఇద్దరు స్టార్ విదేశీ ఆటగాళ్లను వదులుకోనున్న ముంబై ఇండియన్స్.. ఎవరంటే?

Mumbai Indians may release Chris Lynn, Nathan Coulter-Nile and Saurabh Tiwary
IPL 2021 Auction : 3 Players Mumbai Indians Might Release Ahead Of The Auctions || Oneindia Telugu

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి ప్రతిబంధకాలను దాటుకుని యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 సీజన్‌ విజయవంతం అయింది. ఇక 2021లో 14వ సీజన్‌ రెడీ అవుతోంది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 10 తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్‌ 14వ సీజన్‌ కోసం ఫిబ్రవరిలో మినీ వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 20లోగా తమకు వద్దనుకున్న ఆటగాళ్లను వేలంలోకి విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీలకు సూచించింది. దీంతో అన్ని జట్లు తమ ఆటగాళ్ల గత ప్రదర్శనపై కసరత్తుల్ని ప్రారంభించాయి.

కౌల్టర్ నైల్:

కౌల్టర్ నైల్:

గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన చాలా మంది ప్లేయర్స్ మంచి ప్రదర్శన కనబరిచారు. అయితే ఐపీఎల్ 2021లో కొంతమంది సీనియర్ ఆటగాళ్లను ముంబై వదులుకొనుంది. వారిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ నాథన్ కౌల్టర్ నైల్‌ను రూ .8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గత సీజన్‌లో ఈ పేసర్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. జేమ్స్ ప్యాటిన్సన్ రాకతో నైల్‌కు అవకాశాలు సరిగా రాలేదు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లలో మాత్రమే తీశాడు. శ్రీలంక స్టార్ లసిత్ మలింగ ముంబైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీంతో వచ్చే సీజన్‌కు ముంబై నైల్‌ను వదులుకొనుంది.

 క్రిస్ లిన్:

క్రిస్ లిన్:

2020 ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా బ్యాట్స్ మాన్ క్రిస్ లిన్‌ను ముంబై ఇండియన్స్ రూ .2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. క్వింటన్ డీకాక్‌ జట్టులో ఉండడంతో లిన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటికే జట్టులో హేమాహేమీలు ఉండడంతో లిన్‌ అవసరం ముంబైకి లేకుండా పోయింది. దీంతో ఐపీఎల్ 2020లో ముంబై అతడిని వదులుకునే అవకాశం ఉంది. బిగ్ బాష్ లీగ్‌లో లిన్ అద్భుతంగా ఆడుతాడన్న విషయం తెలిసిందే.

 సౌరభ్ తివారీ:

సౌరభ్ తివారీ:

ముంబై ఇండియన్స్‌కు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సౌరభ్ తివారీ గత సీజన్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. తివారీ స్ధానంలో వచ్చిన ఇషాంత్ కిషన్ అద్భుతంగా రాణించారు. దీంతో సౌరభ్ బెంచ్‌కే పరిమితమయ్యారు. ఐపీఎల్ 2020లో తివారీ 7 మ్యాచ్‌ల్లో 103 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ముంబై తివారీని వదిలుకుని అతని స్థానంలో మరో యువ ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు అయిన ముంబై ఇండియన్స్ 5వ సారి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

నోటికి పని చెప్పడంతో.. పంత్‌ తీరుపై ఫైర్ అయిన కామెంటేటర్లు!!

Story first published: Friday, January 15, 2021, 18:05 [IST]
Other articles published on Jan 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X