Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. టీ20ల్లో వరల్డ్ రికార్డ్!

ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 50 వేల పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 15వ ఓవర్‌లో 50 వేల పరుగుల మైలురాయి అందుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డ్ కోసం 114 పరుగుల వెనుకంజలో ఉన్న ముంబై ఇండియన్స్.. 15వ ఓవర్ ఆ పరుగులు పూర్తి చేసింది.

ముంబై ఇండియన్స్ 308వ టీ20 మ్యాచ్‌లు ఈ రికార్డ్ అందుకుంది. ఐపీఎల్‌లో 286 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్.. ఛాంపియన్స్ లీగ్‌‌లో 22 మ్యాచ్‌లు ఆడింది. ముంబై ఇండియన్స్ సాధించిన ఈ 50 వేల పరుగుల్లో అత్యధిక వాటా ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మదే. అతను ముంబై ఇండియన్స్ తరఫున 240 మ్యాచ్‌లు ఆడి 6286 పరుగులు చేశాడు. అతని తర్వాతి స్థానాల్లో 3,933 పరుగులతో సూర్యకుమార్ యాదవ్, 3,915 పరుగులతో కీరన్ పొలార్డ్ ఉన్నారు.

Mumbai Indians Make History at Chepauk First T20 Team to Surpass 50 000 Runs

ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన సోమర్‌సెట్ జట్టు ఉంది. ఆ టీమ్ 303 మ్యాచ్‌ల్లో 48244 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 295 మ్యాచ్‌ల్లో 47304 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 286 మ్యాచ్‌ల్లో 46,438 పరుగులతో నాలుగో స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Saturday, May 2, 2026, 23:01 [IST]
Other articles published on May 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+