Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ముంబై ఇండియన్స్ రిటైన్, రిలీజ్ చేసుకునే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఆట పరంగా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ విజేతగా నిలవలేకపోయింది. అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుస ఓటములతో టోర్నీని ప్రారంభించిన ముంబై ఇండియన్స్.. జస్‌ప్రీత్ బుమ్రా రాకతో విజయాల బాట పట్టింది. వరుసగా 6 విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది.

ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కానీ కీలక మ్యాచ్‌లో తడబడింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం ముంబై ఓటమిని శాసించింది. ఫైనల్ చేరకున్నా ముంబై ఇండియన్స్ జట్టు బలంగానే ఉంది. కానీ ఐపీఎల్ 2026 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ వ్యూహాత్మక మార్పులు చేయనుంది. జట్టు లోపాలను సరిదిద్దుకునేందుకు కొంతమంది ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది. వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఎంచుకోనుంది.

Mumbai Indians Likely Retentions and Releases for IPL 2026

ఐపీఎల్ 2025 సీజన్‌లో తీవ్రంగా నిరాశపర్చిన దీపక్ చాహర్, సత్యనారయణ రాజు, ముజీబ్ ఉర్ రెహ్మాన్, రీస్ టోప్లీ, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మలను రిలీజ్ చేయనుంది. తెలుగు ప్లేయర్ సత్యనారయణ రాజు 2 మ్యాచ్‌లు ఆడి 13.25 ఎకానమీతో ఒకే ఒక్క వికెట్ తీసాడు. రూ. 9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ 14 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. గాయాలతో సతమతమయ్యాడు. అఫ్గాన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ ‌కు రిప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కూడా ముంబై వదిలేయనుంది. అతను ఒకే ఒక్క మ్యాచ్ ఆడి తీవ్రంగా నిరాశపర్చాడు.

ముంబై ఇండియన్స్ రిలీజ్ లిస్ట్(అంచనా):

దీపక్ చాహర్(రూ.9.25 కోట్లు), ముజీబ్ ఉర్ రెహ్మాన్(రూ.1.50 కోట్లు), రీస్ టోప్లీ(రూ.70 లక్షలు), రాబిన్ మింజ్(రూ.65 లక్షలు), కర్ణ్ శర్మ(రూ.50 లక్షలు)

ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్:

హార్దిక్ పాండ్యా(రూ. 18 కోట్లు), రోహిత్ శర్మ(రూ.16.30 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు), నమన్ ధీర్(రూ. 5.25 కోట్లు), ట్రెంట్ బౌల్ట్(రూ. 12.50 కోట్లు), ర్యాన్ రికెల్టన్(రూ. కోటి), దీపక్ చాహర్(రూ. 9.25 కోట్లు), విల్ జాక్స్(రూ. 5.25 కోట్లు), అశ్వని కుమార్(రూ. 30 లక్షలు), మిచెల్ సాంట్నర్(రూ. 2 కోట్లు), క్రిష్ణన్ ష్రిజిత్(రూ. 30 లక్షలు), రాజ్ బవా(రూ. 30 లక్షలు), సత్యనారాయణ రాజు(రూ. 30 లక్షలు), అర్జున్ టెండూల్కర్(రూ. 30 లక్షలు), లిజాడ్ విలియమ్స్(రూ. 75 లక్షలు), విగ్నేష్ పుతుర్(రూ. 30 లక్షలు).

Story first published: Tuesday, November 11, 2025, 14:27 [IST]
Other articles published on Nov 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+