Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: కొంపముంచిన హార్దిక్ జిడ్డు బ్యాటింగ్..ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. శనివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్‌లకు 5 గెలిచినా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 పరాజయాలను మూటగట్టుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఈ విజయంతో తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 4 విజయాలు, 5 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Mumbai Indians Knocked Out of IPL 2026 Following Dominant 8-Wicket Win by CSK

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/32) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు.

అనంతరం సీఎస్‌కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 నాటౌట్), కార్తీక్ శర్మ(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఉర్విల్ పటేల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24) దూకుడుగా ఆడాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, అల్లా ఘజన్‌ఫర్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.

కొంపముంచిన హార్దిక్ జిడ్డు బ్యాటింగ్

బ్యాటింగ్ వైఫల్యం ముంబై ఇండియన్స్ కొంపముంచింది. స్లాగ్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా జిడ్డు బ్యాటింగ్‌తో జట్టుకు నష్టం చేశాడు. 23 బంతులు ఆడిన హార్దిక్ 18 పరుగులే చేశాడు. సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(5), విల్ జాక్స్(1) వైఫల్యం కూడా ముంబై ఇండియన్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.

Story first published: Saturday, May 2, 2026, 23:26 [IST]
Other articles published on May 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+