ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ తెలివిగా వ్యవహరించింది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఈ మినీ వేలంలో అత్యల్పంగా రూ.2.75 కోట్లతోనే బరిలోకి దిగిన ముంబై తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తమ మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్‌ను అతని బేస్ ప్రైజ్ రూ. 1 కోటికి కొనుగోలు చేసింది.
ప్రధాన ఆటగాళ్లందర్నీ రిటైన్ చేసుకోవడంతో పాటు వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా తమకు కావాల్సిన ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకుంది. శార్దూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్, మయాంక్ మార్కండేలను ట్రేడ్ చేసుకుంది. దాంతో ఈ వేలంలో ముంబై ఇండియన్స్‌కు పెద్దగా పనిలేకుండా పోయింది. చేతిలో రూ.2.75 కోట్లే ఉన్నా.. చాకచక్యంగా వ్యవహరించి కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
ముంబై ఇండియన్స్‌కు బ్యాకప్ ఓపెనర్‌తో పాటు వికెట్ కీపర్ అవసరం ఉండగా.. డికాక్‌తో ఆ రెండు స్థానాలను భర్తీ చేసింది. డికాక్‌తో పాటు డానిష్ మలెవార్, మహమ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావంత్ వంటి అనామక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. పేపర్‌పై ముంబై ఇండియన్స్ పటిష్టంగా కనిపిస్తోంది.

క్వింటన్ డికాక్(రూ. 1 కోటి), డానిష్ మలేవార్(రూ.30 లక్షలు), మహమ్మద్ ఇజార్(రూ.30 లక్షలు), అథర్వ అంకోలేకర్(రూ.30 లక్షలు), మయాంక్ రావత్(రూ.30 లక్షలు)
ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్:
హార్దిక్ పాండ్యా(రూ. 18 కోట్లు), రోహిత్ శర్మ(రూ.16.30 కోట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు), నమన్ ధీర్(రూ. 5.25 కోట్లు), ట్రెంట్ బౌల్ట్(రూ. 12.50 కోట్లు), ర్యాన్ రికెల్టన్(రూ. కోటి), దీపక్ చాహర్(రూ. 9.25 కోట్లు), విల్ జాక్స్(రూ. 5.25 కోట్లు), అశ్వని కుమార్(రూ. 30 లక్షలు), మిచెల్ సాంట్నర్(రూ. 2 కోట్లు), రాజ్ బవా(రూ. 30 లక్షలు), దీపక్ చాహర్(రూ.9.25 కోట్లు), రాబిన్ మింజ్(రూ.65 లక్షలు).
ట్రేడింగ్ ప్లేయర్స్: షెర్ఫేన్ రూథర్‌పోర్డ్(రూ.2.6 కోట్లు), శార్దూల్ ఠాకూర్(రూ.2 కోట్లు), మయాంక్ మార్కండే
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్/ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విల్ జాక్స్, నమన్ ధీర్/మయాంక్ మార్కండే(ఇంపాక్ట్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్/శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా.