For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: రోహిత్ విధ్వంసం.. 14 ఏళ్ల తర్వాత ముంబై శుభారంభం!

ఐపీఎల్ 2026 సీజన్‌‌ను ముంబై ఇండియన్స్ విజయంతో ప్రారంభించింది. 14 ఏళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో శుభారంభం చేసింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను చిత్తు చేసింది. చివరిసారిగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2012 సీజన్‌లో శుభారంభం చేసింది.

ఆ తర్వాత జరిగిన 13 సీజన్లలోనూ ముంబై తొలి మ్యాచ్‌ను గెలవలేకపోయింది. ఈ చెత్త రికార్డ్‌కు హార్దిక్ సేన ఎట్టకేలకు బ్రేక్ వేసింది. జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ అసాధారణ బౌలింగ్.. రోహిత్ శర్మ, రికెల్టన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

220 పరుగులు చేసినా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67),అంగ్‌క్రిష్ రఘువంశీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 ) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఫిన్ అలెన్(17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), రింకూ సింగ్(21 బంతుల్లో 4 ఫోర్లతో 33 నాటౌట్) దూకుడుగా ఆడారు. ముంబై బౌలరల్లో శార్దూల్ ఠాకూర్(3/35) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టాడు.

Mumbai Indians Ends 14-Year Opening Jinx Rohit Sharma and Rickelton Power Victory Over KKR in IPL 2026

అనంతరం ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(38 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), ర్యాన్ రికెల్టన్(43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలరల్లో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు.

హిట్ మ్యాన్ విధ్వంసం..

భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. తొలి ఓవర్‌ నుంచే కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఈ జోడీ 8.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ అందుకుంది. రోహిత్ 23 బంతుల్లో ర్యాన్ రికెల్టన్ 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

ర్యాన్ రికెల్టన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కేకేఆర్ ఫీల్డర్లు వదిలేసారు. సెంచరీ దిశగా సాగిన రోహిత్ శర్మను వైభవ్ అరోరా క్యాచ్ ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు నమోదైన 148 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సూర్యకుమార్ యాదవ్(16) విఫలమవగా.. అనుకుల్ రాయ్ స్టన్నింగ్ త్రోకు రికెల్టన్ రనౌటయ్యాడు. విజయం ముంగిట తిలక్(20) వెనుదిరిగినా.. నమన్ ధిర్‌తో కలిసి హార్దిక్ పాండ్యా(18 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Sunday, March 29, 2026, 23:16 [IST]
Other articles published on Mar 29, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+