Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ఆ SRH ఆటగాళ్లపై కన్నేసిన ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో పదింటిలో ఓడి తీవ్రంగా నిరాశపర్చింది. దాంతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌‌కు ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యమైన ప్రదర్శన కాదు. జట్టు నిండా స్టార్లు ఉన్నా అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం ముంబై పతనాన్ని శాసించింది. ఈ ఘోర పరాజయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై ఇండియన్స్.. వచ్చే సీజన్‌లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా జట్టును సిద్దం చేస్తోంది.

ఇషాన్ కిషన్ కోసం..

జట్టును వీడాలని నిర్ణయించుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాను అడ్డు పెట్టుకొని తమకు కావాల్సిన ఆటగాళ్లను ఇతర జట్ల నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన ఇషాన్ కిషన్, శివాంగ్ కుమార్ లేదా దేశీయ పేసర్, ఒక ఓవర్‌సీస్ పేసర్‌ను జట్టులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Mumbai Indians Could Target SRH Players Ishan Kishan and Shivang Kumar For IPL 2027

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ట్రేడ్ డీల్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. 'సీఎస్‌కే, కేకేఆర్ కాకుండా ముంబై ఇండియన్స్ ఇతర జట్ల వైపు కూడా చూడవచ్చు.

హార్దిక్ పాండ్యాకు బదులుగా ఒక భారతీయ బ్యాటర్, ఒక విదేశీ/భారతీయ బౌలర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై డీల్‌కు ప్రయత్నించవచ్చు. గతంలో ముంబై ఆటగాడిగా ఉన్నఇషాన్ కిషన్‌ను హార్దిక్ పాండ్యాకు బదులుగా వారు అడగవచ్చు. ఇషాన్ కిషన్, శివాంగ్ కుమార్ లాంటి ఆటగాడు వస్తే హార్దిక్ పాండ్యాకు సమాన విలువ లభిస్తుంది.'అని అశ్విన్ పేర్కొన్నాడు.

SRHతో డీల్‌కు ముంబై ప్రయత్నాలు..

అయితే అశ్విన్ చెప్పిన మాటలు వాస్తవమేనని పలువురు క్రికెట్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ఇషాన్ కిషన్ వంటి ఇండియన్ టాపార్డర్ బ్యాటర్ అవసరం ఉంది. అలాగే శివాంగ్ కుమార్ వంటి స్పిన్నర్‌తో పాటు ఓవర్‌సీస్ పేసర్, ఇండియన్ పేసర్ కూడా కావాలి. హార్దిక్ పాండ్యాను అడ్డు పెట్టి తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ముంబై.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సంపద్రింపులు జరపవచ్చు.

అంతేకాకుండా ఇషాన్ కిషన్ గతంలో ముంబై ఇండియన్స్‌కు మెరుగ్గా ఆడాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉండటమే కాకుండా ఇండియన్ ఐకాన్ ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు. కాబట్టి అతని కోసం ముంబై గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే ఈ డీల్‌కు కావ్యమారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అంగీకరించపోవచ్చని ఆ జట్టు ఫ్యాన్స్ అంటున్నాడు. నితీష్ రెడ్డి రూపంలో జట్టులో మంచి పేస్ ఆల్‌రౌండర్ ఉన్నాడని, హార్దిక్ పాండ్యా కోసం ఇషాన్ కిషన్ వంటి కీలక బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకోదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Friday, August 7, 2026, 15:26 [IST]
Other articles published on Aug 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+