Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లపై కన్నేసిన ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో పదింటిలో ఓడి తీవ్రంగా నిరాశపర్చింది. దాంతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌‌కు ఇది ఏ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. జట్టు నిండా స్టార్లు ఉన్నా .. అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ వైఫల్యం ముంబై పతనాన్ని శాసించింది. ఈ ఘోర పరాజయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై ఇండియన్స్.. వచ్చే సీజన్‌లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా జట్టును సిద్దం చేస్తోంది.

IPL 2027: ముంబై ఇండియన్స్‌కు మరో స్టార్ ప్లేయర్ గుడ్ బై!

IPL 2027: ముంబై ఇండియన్స్‌కు మరో స్టార్ ప్లేయర్ గుడ్ బై!

జట్టును వీడాలని నిర్ణయించుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాను అడ్డుపెట్టుకొని తమకు కావాల్సిన ఆటగాళ్లను ఇతర జట్ల నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటికే సీఎస్‌కే, కేకేఆర్‌తో ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరిపిన ముంబై ఇండియన్స్.. ఇతర ఫ్రాంచైజీలను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది.

Mumbai Indians Could Target LSG Players Nicholas Pooran Prince Yadav and Mohsin Khan for IPL 2027

ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన ప్రిన్స్ యాదవ్, మొహ్‌సిన్ ఖాన్‌తో పాటు నికోలస్ పూరన్‌‌లపై ముంబై కన్నేసినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను ఇచ్చి ఈ ముగ్గురి ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో ముంబై ఉన్నట్లు సమాచారం. నికోలస్ పూరన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముంబై ఫ్రాంచైజీల తరఫున ఆడుతాడు. ఐపీఎల్‌లో కూడా అతన్ని తమ జట్టులోకి తీసుకోవాలనే యోచనలో ముంబై మేనేజ్‌మెంట్ ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌కు కూడా కెప్టెన్ అవసరం ఉంది. రిషభ్ పంత్‌ ఆ జట్టును వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ కూడా లక్నోతో ముంబై సంప్రదింపులు జరపవచ్చని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యాకు బదులుగా ప్రిన్స్ యాదవ్, మోహ్‌సిన్ ఖాన్‌తో పాటు నికోలస్ పూరన్‌ను ముంబై అడగవచ్చని అంచనా వేసాడు. లక్నో జట్టుకు కూడా కెప్టెన్ అవసరం ఉందని, హార్దిక్ పాండ్యాను తీసుకోవడం వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

IPL 2027: కావ్యమారన్‌కు బిగ్ షాక్.. అప్‌కమింగ్ సీజన్‌కు SRH కెప్టెన్ దూరం!

Also Read

IPL 2027: కావ్యమారన్‌కు బిగ్ షాక్.. అప్‌కమింగ్ సీజన్‌కు SRH కెప్టెన్ దూరం!

అయితే ఒక్క హార్దిక్ పాండ్యా కోసం లక్నో సూపర్ జెయింట్స్ ముగ్గురు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, ముంబై ఇండియన్స్ ఓనర్స్ ముఖేష్ అంబానీ మధ్య మంచి వ్యాపారా లావాదేవీలున్నాయి. గత సీజన్‌కు ముందు శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేేసుకుంది. ఈ ట్రేడ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ తరహాలోనే ముంబై తమకు కావాల్సిన ఆటగాళ్లను లక్నో నుంచి తీసుకోవచ్చే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Story first published: Sunday, August 9, 2026, 13:17 [IST]
Other articles published on Aug 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+