Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రైనాను వెనక్కినెట్టాడు: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డు

Mumbai Indians captain Rohit Sharma sixes record in ipl

హైదరాబాద్: వరుసగా గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమవుతూ వస్తోన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 52 బంతుల్లో 5 సిక్స్‌లు, 10 ఫోర్ల సాయంతో 94 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. 269 సిక్సులతో ఈ జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్‌ శర్మ (179), సురేశ్‌ రైనా(174), ఏబీ డివిలియర్స్‌ (167) ఉన్నారు.

డెక్కన్‌ ఛార్జర్స్‌ హైదరాబాద్‌ తరఫున 2008లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ మంగళారం నాటి మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో మిడ్‌ వికెట్‌ మీదుగా రోహిత్ సిక్స్‌ బాదాడు. ఈ సిక్స్‌తో రోహిత్ శర్మ... సురేశ్ రైనాను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు.

ఈ హాఫ్ సెంచరీ రోహిత్ శర్మకు టీ20ల్లో 50వది కావడం విశేషం. టీ20ల్లో 50 హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ మూడో వాడు. రోహిత్‌ కంటే ముందు గంభీర్‌, కోహ్లీ ఉన్నారు. డెక్కన్‌ ఛార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌లో రోహిత్‌ 34 హాఫ్ సెంచరీలు సాధించాడు.

Story first published: Wednesday, April 18, 2018, 16:14 [IST]
Other articles published on Apr 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+