Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదు నెలల కసి: రోహిత్ సిక్స్ బాదితే.. బంతి రోడ్డుపై వెళుతున్న బస్సుపై పడింది (వీడియో)

Mumbai Indians Captain Rohit Sharma hits huge six in practice as ball lands on moving bus rooftop

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని ప్రాంఛైజీలు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా పది రోజులే ఉండడంతో అన్ని జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. సెప్టెంబర్‌ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో ముంబై సాధన మరింత తీవ్రతరం చేసింది. ఆటగాళ్లు నైట్ సెషన్‌లో కూడా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.

రోహిత్ ప్రాక్టీస్:

టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంటేనే భీక‌ర‌మైన‌ హిట్టింగ్‌కు పెట్టింది పేరు. బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి దిగాడంటే.. హిట్‌మ్యాన్ ఎంత క‌సిగా ఆడుతాడో ఇప్ప‌టికే చాలాసార్లు చూశాం. అత‌ను క్రీజువదిలి ముందుకొచ్చి బంతిని బ‌లంగా బాదాడంటే.. స్టేడియం అవ‌త‌ల ప‌డాల్సిందే. తాజాగా కూడా అలానే జరిగింది. అబుదాబి స్టేడియంలో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒక‌టి ఆ జ‌ట్టు యాజ‌మాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

బ‌స్సు రూఫ్‌టాప్‌పై ప‌డింది:

బ‌స్సు రూఫ్‌టాప్‌పై ప‌డింది:

వీడియోలో బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్న రోహిత్ శర్మ స్పిన్న‌ర్ వేసిన బంతిని బారీ సిక్స్‌గా మ‌లిచాడు. 95 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి.. స్టేడియం బ‌య‌ట రోడ్డు మీద వెళ్తున్న బ‌స్సు రూఫ్‌టాప్‌పై ప‌డింది. దీంతో బౌలింగ్ వేసిన స్పిన్న‌ర్ ఒక్కసారిగా ఆచ్చర్యపోయాడు. ఇక సిక్సర్ బాదిన రోహిత్ విజ‌య‌సంకేతం చూపించాడు. దాదాపు నాలుగు నెల‌ల త‌ర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేప‌ట్టిన రోహిత్.. బారీ షాట్ల‌తో విరుచుకుపడ్డాడు. దేంతో ఐపీఎల్ 2020 మ్యాచ్‌లో త‌న విధ్వంసం ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌క‌నే చెప్పాడు.

ఒక్క రోహిత్‌కే సాధ్యం:

ఒక్క రోహిత్‌కే సాధ్యం:

రోహిత్ శర్మ ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌న ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ సరికొత్త కాప్ష‌న్‌ను ఇచ్చింది. 'బ్యాట్స్‌మెన్లు సిక్స్‌లు కొడతారు.. లెజెండ్స్ స్టేడియాల‌ను క్లియ‌ర్ చేస్తారు.. కానీ హిట్‌మ్యాన్ మాత్రం మూడు ప‌నులు ( బారీ సిక్స్‌+ స్టేడియం అవ‌త‌ల + వాహ‌‌నాల‌పై ప‌డ‌డం) క‌లిపి చేస్తాడు. అది కేవలం రోహిత్‌ శర్మకే సాధ్యం' అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు వావ్ అంటున్నారు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి:

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి:

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్‌ జట్టు సెప్టెంబర్‌ 19న అబుదాబి వేదికగా జరగబోయే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో తలపడనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో ఏకంగా నాలుగు సార్లు ఈ జట్టు ఐపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈసారి కూడా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉంది.

'అప్పుడే పోలికలా.. విరాట్ కోహ్లీ దరిదాపుల్లో కూడా లేను'

Story first published: Wednesday, September 9, 2020, 19:45 [IST]
Other articles published on Sep 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+