Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli Birthday: ముంబై ఇండియన్స్ ట్వీట్.. రోహిత్-కోహ్లీ మధ్య వైరం నిజమేనా?

Mumbai Indians Birthday wish For Virat Kohli sparks another rumour Of Rift Between Him and Rohit

దుబాయ్: టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా కోహ్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు, అభిమానులతో పాటు ఫ్రాంచైజీలు సైతం కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నాయి. దీంతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌కు ట్విట్టర్లో వెల్లువలా శుభాకాంక్షలు వస్తున్నాయి. #HappyBirthdayViratKohili హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో మోత మోగుతోంది. ఆర్సీబీ తమ సారథికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.

హార్దిక్ పాండ్యాతో ఫొటో:

ఆర్సీబీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు విరాట్ కోహ్లీకి విషెస్ తెలిపాయి. అన్ని ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లతో విరాట్ కోహ్లీ ఉన్న ఫొటోను ఉంచి బర్త్ డే విషెస్ తెలపగా.. ముంబై మాత్రం హార్దిక్ పాండ్యా, కోహ్లీ టీమిండియా జెర్సీలో ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది. 'హ్యాపీ బర్త్‌డే.. విరాట్ కోహ్లీ' అని ట్వీట్ చేసి.. కోహ్లీతో హార్దిక్ చేయి కలుపుతున్న ఫొటోను ఉంచింది. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కోహ్లీ-రోహిత్ కలిసి ఉన్న ఫొటో ఒక్కటి లేదా:

రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయని నేపథ్యంలో.. వైస్‌ కెప్టెన్,కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ రోహిత్-కోహ్లీ ఫొటోను కూడా ట్వీట్ చేయకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీ దగ్గర కోహ్లీ -రోహిత్ కలిసి ఉన్న ఫొటో ఒక్కటి కూడా లేదా? అని ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అడ్మిన్‌ను ప్రశ్నిస్తున్నారు. నా వద్ద కోహ్లీ-రోహిత్ కలిసి ఉన్న ఫొటోలు చాలా ఉన్నాయి.. మీకు సెండ్ చేయాలా? అని మరికొందరు అడుగుతున్నారు. ముంబై ఇలా ట్వీట్ చేయడం.. రోహిత్-కోహ్లీ మధ్య సంబంధాలు బాగోలేవన్న వాదనకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి.

వన్డే ప్రపంచకప్‌ సమయంలో తెరపైకి వివాదం:

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ ముందు వరకు కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ మధ్య విభేదాల ప్రస్తావన తెరమీదకు రాలేదు. న్యూజిలాండ్‌ చేతిలో భారత్ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో.. కోహ్లీ, రోహిత్‌ మధ్య స్నేహం సవ్యంగా లేదనే సంగతి బయటపడింది. కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. జట్టులో మిగతావాళ్ల అభిప్రాయాలకు విలువేలేదని రోహిత్ ఆగ్రహించాడని తెలిసింది. ఆటగాళ్ల ఎంపికలోనూ రోహిత్ మాట వినిపించుకోలేదని సమాచారం. జట్టు అవసరాల మేరకు కాకుండా తన శిబిరం వారినే కోహ్లీ తుది జట్టులోకి తీసుకోవడం హిట్‌మ్యాన్‌కు నచ్చలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో అతడు కోహ్లీ, అనుష్కను ఇన్‌స్టాలో అన్‌ఫాలో అయ్యాడని తెలియడంతో రచ్చ మొదలైంది.

అనుష్క ఓ చివరన కూర్చొంటే.. రితిక మరో చివరన:

ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత రోహిత్‌-కోహ్లీపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగింది. ఈ వివాదంలోకి కుటుంబ సభ్యులనూ లాగారు. అప్పటికి కోహ్లీ, అనుష్క ఇన్‌స్టా ఖాతాలను రోహిత్‌ అన్‌ఫాలో చేశాడు. కోహ్లీ మాత్రం రోహిత్‌, రితికాను ఫాలో అవుతున్నాడు. అనుష్క మాత్రం ఇద్దరినీ ఫాలో అవ్వడం లేదు. రితిక సైతం విరుష్కను అన్‌ఫాలో చేసింది. ఇక మ్యాచులు ఆడేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే.. రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని కోహ్లీ స్పష్టం చేశాడు. తమ మధ్య వివాదం లేదని పేర్కొన్నాడు. ఆ తర్వాతి పర్యటనలో కోహ్లీ, రోహిత్‌ కలిసి ఆడుతూ.. నవ్వుతూ కనిపించడంతో వివాదం మరుగునపడింది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంతో మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది.

Women's T20 Challenge 2020: మిథాలీ సేన ఘోర ఓటమి.. 7.5 ఓవర్లలోనే స్మృతి టీం సూపర్‌ విక్టరీ!!

Story first published: Thursday, November 5, 2020, 19:03 [IST]
Other articles published on Nov 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+