Women's T20 Challenge 2020: మిథాలీ సేన ఘోర ఓటమి.. 7.5 ఓవర్లలోనే స్మృతి టీం సూపర్ విక్టరీ!!

షార్జా: యూఏఈ వేదికగా మహిళల టీ20 ఛాలెంజ్ 2020లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో స్మృతి మంధానా నేతృత్వంలో ట్రయల్స్ బ్లేజర్ ఘన విజయం సాధించింది. మిథాలీ రాజ్ సారథ్యంలోని వెలాసిటీని చిత్తుగా ఓడించింది. వెలాసిటీ నిర్దేశించిన 48 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ట్రయల్స్ బ్లేజర్ కేవలం 7.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. డియాండ్రా డాటిన్ (29; 28 బంతుల్లో 3×4), రిచా ఘోష్ (13; 10 బంతుల్లో 1×4, 1×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ స్మృతి మంధాన (6) నిరాశపరిచింది.

డాటిన్, ఘోష్ మెరుపులు
48 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధానా త్వరగానే ఔట్ అయింది. 9 బంతులు ఆడి కేవలం 6 రన్స్ చేశాడు. మంధాన అవుటైనప్పటికీ మరో ఓపెనర్ డియాండ్రా డాటిన్, రిచా ఘోష్‌లు కలిసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇద్దరూ యథేచ్ఛగా షాట్లు కొడుతూ 8 ఓవర్లు కూడా పూర్తికాకుండానే జట్టును విజయ తీరాలకు చేర్చారు. డాటిన్ 28 బంతుల్లో 29 పరుగులు చేయగా.. రిచా ఘోష్ 10 బంతుల్లో 13 పరుగులు చేసింది. విజయం మాత్రమే కాదు తిరుగులేని రన్‌రేట్ కూడా అందించారు.

నిరాశపరిచిన షెపాలీ
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన వెలాసిటీ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్‌ను బుధవారం రాత్రి చిత్తుచేసిన వెలాసిటీ.. ట్రయల్ బ్లేజర్స్‌పై మాత్రం పూర్తిగా తేలిపోయింది. బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో 15.1 ఓవర్లలో వెలాసిటీ 47 పరుగులకే ఆలౌటైంది. ప్రపంచ నంబర్‌వన్ బౌలరైన సోఫీ ఎకిల్‌స్టోన్ (4/9), రాజేశ్వరీ గైక్వాడ్ (2/13), జులన్ గోస్వామి (2/13) సమష్టిగా వెలాసిటీని దెబ్బకొట్టారు. ఒక సిక్సర్, బౌండరీ బాది జోరుమీదున్న ఓపెనర్ షెపాలీ వర్మ (13)ను 2.2వ బంతికే జులన్ బౌల్డ్ చేసింది.

ఎకిల్‌స్టోన్ మాయ
ఆ తర్వాత ఎకిల్‌స్టోన్ మాయ చేసింది. జట్టు స్కోరు 19 వద్ద వరుసగా మిథాలీ రాజ్ (1), వేద కృష్ణమూర్తి (0)ను పెవిలియన్ పంపించింది. ఆపై డేనియెల్ వ్యాట్ (3)ను జులన్ ఔట్ చేయడంతో వెలాసిటీ కష్టాల్లో పడింది. గత మ్యాచులో అద్భుతంగా ఆడిన సుష్మ వర్మ (1), సున్ లుస్ (4) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. సుష్మను ఎకిల్‌స్టోన్, లూస్‌ను రాజేశ్వరీ ఔట్ చేశారు. కీలక సమయంలో శిఖా పాండే (10) రనౌట్ అయింది. కాస్పెరెక్ (11) అజేయంగా నిలిచింది. అయితే సుశ్రీ దివ్యదర్శిని (0)ని గైక్వాడ్, ఎక్తాబిష్ఠ్ (0)ను దీప్తి, జహనారా ఆలమ్ (1)ను ఎకిల్‌స్టోన్ ఔట్ చేశారు. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు ఇదే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సమయం వస్తుంది.. సూర్యకుమార్‌కు గంగూలీ స్పెషల్ మెసేజ్!!