DC vs MI: రోహిత్ సేనను కలవరపెడుతున్న చెత్త రికార్డు.. 9 ఏళ్లుగా శుభారంభం లేదు!


ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి డబుల్ ధమాకాకు వేళైంది. నేడు(ఆదివారం) రెండు మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు డబుల్ మజా ఇవ్వనున్నాయి. బ్రౌబర్న్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడనుంది. రాత్రి 7.30 జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ ఆడనుంది. అయితే ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు ముంబైని ఓ చెత్త రికార్డు కలవరపెడుతోంది. ఇప్పటికే 5 టైటిళ్లు గెలిచినా.. గత 9 ఏళ్లుగా రోహిత్ సేన శుభారంభం చేయలేదు. ఇది ఆ ఫ్రాంచైజీ అభిమానుల్లో ఆందోళన రెకిత్తిస్తోంది.

2012లో చివరిసారిగా..
ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ శైలి. అయితే ముంబై 2013 సీజన్ నుంచి గత సీజన్ వరకు ముంబై తమ తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించలేదు. మరీ ఈ సారైనా ఆ చెత్త రికార్డును చెరపేసుకుంటుందా? అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా? అనేది చూడాలి. చివరిసారిగా ముంబై తమ ఫస్ట్ మ్యాచ్‌ను 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై నెగ్గింది. అప్పటి నుంచి తొలి మ్యాచ్‌లో గెలవనేలేదు.

2013లో స్టార్టింగ్ ట్రబుల్ షురూ..
2013లో ఆర్‌సీబీతో తొలి మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ 2 పరుగులతో ఓటమిపాలైంది. 156 రన్స్ పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆఖరి ఓవర్‌లో విజయానికి 10 రన్స్ చేయలేక చేతులెత్తేసింది. అప్పటి ఆర్‌సీబీ బౌలర్ వినయ్ కుమార్ సూపర్ బౌలింగ్‌తో ఆర్‌సీబీ గట్టెక్కింది. కానీ ఆ సీజన్‌లో ముంబై తొలి టైటిల్ అందుకోవడం విశేషం. అనంతరం 2014 సీజన్‌లో కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన 41 రన్స్‌తో ఓటమిపాలైంది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. రోహిత్, అంబటి రాయుడు రాణించినా విజయాన్నందుకోలేకపోయింది. ఈ సీజన్‌లో కేకేఆర్ టైటిల్ అందుకుంది.

2015లోనూ శుభారంభం దక్కలేదు..
ఇక 2015లో కేకేఆర్‌తో సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడిన ముంబై శుభారంభాన్ని అందుకోలేకపోయింది. ప్రత్యర్థి ముందు ఉంచిన 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కేకేఆర్ 9 బంతులు మిగిలుండగానే టార్గెట్ చేజ్ చేసి 7 వికెట్లతో విజయాన్నందుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సీజన్‌లో ముంబై రెండో టైటిల్ కైవసం చేసుకుంది. 2016లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మళ్లీ సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్.. రైజింగ్ పుణె సూపర్ గెయింట్స్ చేతిలో కంగుతిన్నది. ఈ మ్యాచ్‌లో ముంబై అత్యల్ప స్కోర్ నమోదు చేయగా.. పుణె 9 వికెట్లతో 5 ఓవర్లు మిగిలుండగానే చేధించింది.

అదే సీన్ రిపీట్...
ఇక 2017, 18, 19, 20, 21 సీజన్లలో కూడా ముంబై శుభారంభాన్ని అందుకోలేదు. కానీ 2017, 19, 20 సీజన్లలో టైటిల్ గెలుచుకొని సత్తా చాటింది. 2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో తొలి మ్యాచ్ ఆడిన ముంబై 7 వికెట్లతో ఓడిపోయింది. 184 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. 2018లో ఆర్‌సీబీతో తొలి మ్యాచ్ ఆడగా.. 1 వికెట్‌తో ఓటమిపాలైంది.
165 పరుగుల స్కోర్‌ను కాపాడుకోలేక చేతులెత్తేసింది. 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన ముంబై 37 రన్స్‌తో ఓటమిపాలైంది. ఢిల్లీ నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేసింది. కానీ ఆఖర్లో అదరగొట్టి టైటిల్ పట్టింది. 2020లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫస్ట్ మ్యాచ్ ఆడిన ముంబై.. 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై 162 పరుగులే చేయగా.. చెన్నై నాలుగు బంతులు మిగిలుండగానే 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలుపొందింది. గతేడాది ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ముంబై 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరి ఈ సారి అయినా ఈ స్టార్టింగ్ ట్రబుల్‌కు చెక్ పెడ్తుతుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications