Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పృథ్వీ షా.. నీ ఆకారమే నువ్వు ఆటకు పనికిరావని చెబుతోంది: ముంబై క్రికెట్ అసోసియేషన్

ఫిట్‌నెస్ లేకపోవడంతోనే పృథ్వీ షాను విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేయలేదని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) అధికారి ఒకరు స్పష్టం చేశారు. పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలని సూచించారు. విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కని విషయం తెలిసిందే.

ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన పృథ్వీ షా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లోకి తారా జువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు.

Mumbai Cricket Association reveals why Prithvi Shaw out of the Vijay Hazare Trophy squad

చెడు స్నేహాలతో..
గాయాలు, చెడు స్నేహం, క్రమశిక్షణరాహిత్యం అతని కెరీర్‌ను దెబ్బతీసాయి. చివరకు ఐపీఎల్‌లో కూడా అన్‌సోల్డ్‌గా నిలిచాడు. రంజీ ట్రోఫీ మధ్యలోనే క్రమశిక్షణా రాహిత్యం‌తో ముంబై జట్టులో చోటు కోల్పోయాడు. ఇది అతనిపై తీవ్ర ప్రభావం చూపించింది.
6 ఏళ్ల పాటు అంటిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో వదిలేయగా.. ఒక్క ఫ్రాంచైజీ కూడా పృథ్వీ షాను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.

రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయలేదు. ఫిట్‌నెస్, క్రమశిక్షణారాహిత్యంతో పక్కకుపెట్టేసాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో మళ్లీ ముంబై జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా మళ్లీ పూర్వవైభవం అందుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులోనే పృథ్వీ షా చోటు దక్కించుకోలేకపోయాడు.

నేనింకేం చేయాలి..?
తనను ఎంపిక చేయకపోవడంపై పృథ్వీ షా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఇంకేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు.
దేవుడా చెప్పు.. నేను ఇంకేం చేయాలి. 65 ఇన్నింగ్స్‌లు.. 3399 పరుగులు.. 55.7 సగటు.. స్ట్రైక్‌రేట్ 126 నమోదు చేసినా.. నా ఎంపికకు ఇవి సరిపోలేదు. అయినా నీ(దేవుడి)పై నా నమ్మకం సడలదు. ప్రజలు కూడా నన్ను విశ్వసిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను ఖచ్చితంగా పునరాగమనం చేస్తాను. ఓం సాయిరామ్' అని ఇన్‌స్టా స్టోరీలో పృథ్వీ షా పేర్కొన్నాడు.

నిన్ను చూస్తేనే ఆటకు పనికిరావని తెలుస్తోంది..
ఈ పోస్ట్ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి అతని వేటుకు గల కారణాన్ని వెల్లడించాడు. 'పృథ్వీ షాను విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం అతని ఫిట్‌నెస్. అంతేకాకుండా అతని ప్రదర్శన కూడా గొప్పగా లేదు. ప్రధాన కారణం మాత్రం ఫిట్‌నెస్. ఇటీవల అతను ఆడిన మ్యాచ్‌లను చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది.

అతన్ని పరిశీలిస్తేనే ఫిట్‌నెస్ లేదనే విషయం తెలుస్తోంది. పృథ్వీ షా ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెడుతాడని ఆశిస్తున్నాం. అతని ప్రతిభ గురించి అందరికి తెలిసిందే. పృథ్వీ షా చేసే హార్డ్ వర్క్‌పై అతని పునరాగమనం ఆధారపడి ఉంది. 'అని సదరు అధికారి స్పష్టం చేశాడు.

Story first published: Thursday, December 19, 2024, 17:19 [IST]
Other articles published on Dec 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+