Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పృథ్వీ షా.. ప్రాక్టీస్‌కు రాకుండా లేట్ నైట్ పార్టీలకు వెళ్లేవాడు!

టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా‌‌ వ్యవహారశైలిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ ఘాటుగా స్పందించింది. అతని ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ప్రవర్తన బాగా లేకపోవడంతోనే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదని స్పష్టం చేసింది. పృథ్వీ షా ప్రాక్టీస్‌కు రాకుండా లేట్ నైట్ పార్టీలకు వెళ్లేవాడని పేర్కొంది.

ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా జట్టులో ఉన్న పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని ఎంసీఏకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా సరిగ్గా ప్రాక్టీస్‌కు వచ్చేవాడు కాదు. అర్థరాత్రి హోటల్ బయటకు వెళ్లి ఉదయం 6 గంటలకు తిరిగి వచ్చేవాడు. అతని కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై 10 మంది ఫీలర్లతోనే ఆడాల్సి వచ్చింది. అతను మైదానంలో ఉన్నా లేనట్లే.

Mumbai Cricket Association official says Prithvi Shaw is his own enemy on Vijay Hazare snub

బంతి అతని పక్కనుంచి వెళ్లినా దాన్ని పట్టుకోలేడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా సరైన సమయంలో బంతిని హిట్ చేయడంలో తడబడటం చూశాం. అతని ఫిట్‌నెస్ ఏ మాత్రం బాలేదు. క్రమశిక్షణ, ప్రవర్తన కూడా సరిగ్గా లేదు. ఈ విషయంపై చాలా సార్లు అతనికి చెప్పి చూశాం. మేం ఎవర్నీ లాలించి ఆడించలేం.

పృథ్వీ షాకు శత్రువులెవరూ లేరు. తనకి తానే శత్రువు. జట్టులోని సీనియర్లు కూడా ఇప్పుడు అతని వైఖరిపై ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్‌లు పెడితే ముంబై సెలెక్టర్లు, ఎంసీఏపై ప్రభావం చూపిస్తాయని అనుకోవడం తప్పు. పృథ్వీ షా ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెడుతాడని ఆశిస్తున్నాం. అతని ప్రతిభ గురించి అందరికి తెలిసిందే. పృథ్వీ షా చేసే హార్డ్ వర్క్‌పై అతని పునరాగమనం ఆధారపడి ఉంది. 'అని ఎంసీఏ అధికారి తెలిపారు.

నేనింకేం చేయాలి..?
విజయ్ హజారే ట్రోఫీకి తనను ఎంపిక చేయకపోవడంపై పృథ్వీ షా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఇంకేం చేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు.
దేవుడా చెప్పు.. నేను ఇంకేం చేయాలి. 65 ఇన్నింగ్స్‌లు.. 3399 పరుగులు.. 55.7 సగటు.. స్ట్రైక్‌రేట్ 126 నమోదు చేసినా.. నా ఎంపికకు ఇవి సరిపోలేదు. అయినా నీ(దేవుడి)పై నా నమ్మకం సడలదు. ప్రజలు కూడా నన్ను విశ్వసిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను ఖచ్చితంగా పునరాగమనం చేస్తాను. ఓం సాయిరామ్' అని ఇన్‌స్టా స్టోరీలో పృథ్వీ షా పేర్కొన్నాడు.

Story first published: Friday, December 20, 2024, 16:21 [IST]
Other articles published on Dec 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+