Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇది మా నాన్న కల.. సిక్సర్లు కొట్టడం నాకు సరదా: ముకుల్ చౌదరి

మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం తన తండ్రి కల అని లక్నో సూపర్ జెయింట్స్ నయా మ్యాచ్ విన్నర్ ముకుల్ చౌదరి అన్నాడు. తన తండ్రి పెళ్లి కాకముందే తనకు పుట్టబోయే కొడుకును క్రికెటర్ చేయాలనుకున్నాడని తెలిపాడు. ఆయన కలను ఈ మ్యాచ్ ద్వారా సాకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ముకుల్ చౌదరి చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్)తో గురువారం కోల్‌కతా వేదికగా హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన లక్నో జట్టును.. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ముకుల్ చౌదరీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో గెలిపించాడు. 7 భారీ సిక్స్‌లు బాది అసాధ్యమనకున్న లక్నో విజయాన్ని సుసాధ్యం చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Mukul Chowdary Fulfills His Father s Pre-Marriage Dream After Stunning Match-Winning Fifty Against KKR
Photo Credit: screen grab for JioHotstar

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తన క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'మా నాన్నకు పెళ్లి కాకముందు నుంచే.. తన కొడుకును క్రికెట్ చేయాలని కలలు కన్నాడు. ఆరంభంలో మా ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదు. 12-13 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. మా ఊరు జుంజులో ఎక్కువ క్రికెట్ అకాడమీలు లేవు. అందుకే జైపూర్‌కు మారాను. టీ20 క్రికెట్ ఎదుగుదల చూసి గుర్గావ్‌కు వెళ్లి అక్కడ 3-4 నెలలు ఉన్నాను.

యూపీతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో నా ప్రదర్శనను చూసి నేను క్రికెటర్ అవుతాననే విషయాన్ని మా నాన్న నమ్మాడు. అది లో- స్కోరు గేమ్. కానీ నేను పరుగులు చేశాను. అప్పుడే నేను పెద్ద స్థాయికి చేరుతానని మా నాన్నకు నమ్మకం కలిగింది. ఫ్లడ్ లైట్ల కింద నేను ఆడిన రెండో మ్యాచ్ ఇది. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఒత్తిడిలా కాకుండా గోల్డెన్ ఛాన్స్‌లా చూసాను.

చివరి వరకు ఆడాలనేదే నా ప్లాన్. నేను క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలననే నమ్మకం నాకుంది. ఈరోజు కొట్టిన మొదటి సిక్స్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే ఈ రోజు నేను కొట్టిన మొదటి సిక్స్ అదే.ఆఖరి ఓవర్‌లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఏదో ఒక బంతి నా జోన్‌లోకి వస్తుందని తెలుసు. ఒక్క సిక్స్ కొడితే చాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను హిట్టింగ్ చేస్తున్నాను. బంతి నా జోన్‌లో ఉంటే బాదేస్తాను. సిక్సర్లు కొట్టడం నాకు చాలా ఇష్టం.'అని ముకేష్ చౌదరి తెలిపాడు.

Story first published: Friday, April 10, 2026, 1:10 [IST]
Other articles published on Apr 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+