Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంబానీ కన్ను.. డిస్నీ హాట్‌స్టార్ కనుమరుగు!

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కనుమరుగవ్వనుందా? జియోసినిమా దెబ్బకు తమ సేవలను నిలిపివేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా భారత్‌ వేదికగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆపరేషన్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, జియోసినిమా సంస్థల వీలినానికి వేగంగా అడుగులు పడుతున్నాయని ఓ జాతీయ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ రెండు సంస్థల విలీనమైతే.. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ వాటా 51 శాతానికి చేరుకుంటుంది.

 Mukesh Ambanis Reliance, Disney media merger deal enters final leg

దీంతో అతిపెద్ద షేర్‌ హోల్డర్‌గా రిలయన్స్ నిలవనుంది. అంతేకాకుండా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతిపెద్ద సంస్థగానూ రిలయన్స్ సంస్థ అవతరించనుంది. అటు డిస్నీ ప్లస్‌కు విలీన సంస్థలో 49 శాతం వాటా ఉండనుట్లు తెలుస్తోంది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18కి అనుబంధ సంస్థగా విలీన సంస్థను ఏర్పాటు చేయనున్నారని సదరు వెబ్ సైట్ తమ కథనంలో వెల్లడించింది.

యాజమాన్య వాటా కోసం రిలయన్స్‌ నగదు రూపంలో చెల్లింపులు జరపనుందని కూడా పేర్కొంది. అయితే ఈ నగదు మొత్తం ఎంత? అనే వివరాలు తెలియాల్సి ఉంది. విలీన సంస్థ బోర్డులో అటు రిలయన్స్‌, ఇటు డిస్నీ ప్లస్‌కు సమాన ప్రాతినిథ్యం ఉండబోతోందని సమాచారం. ఇరు సంస్థల నుంచి చెరొక డైరెక్టర్ ఉంటారని తెలుస్తోంది.

వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ఈ విలీనం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటి వరకు ఈ విలీన ప్రతిపాదనపై ఇరు సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను కోల్పోయిన డిస్నీకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌లో తమ వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తున్నట్లు బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి.

జియోసినిమా వచ్చే వరకు స్పోర్ట్స్ కేటగిరిలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌‌కు తిరుగులేదు. ఈ మార్కెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్న జియోసినిమా.. హాట్‌స్టార్‌ను దక్కించుకుంటే అది సాధ్యమవుతుందని వ్యూహాలు రిచిస్తోంది. ముఖేష్ అంబానీ వయాకమ్ 18 ద్వారా జియోసినిమా యాప్‌ను లాంఛ్ చేసి ఐపీఎల్ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకోవడంతో డిస్నీ హాట్‌స్టార్‌కు ఊహించని షాక్ తగిలింది.

అంతేకాకుండా జియోసినిమా తమ సేవలను ఫ్రీగా అందించేందుకు ముందుకు రావడంతో హాట్‌స్టార్ నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. చివరకు హాట్‌స్టార్ సైతం.. జియోసినిమా తరహాలో ఫ్రీగా సేవలను అందిస్తోంది. ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్, సౌతాఫ్రికా పర్యటనకు సంబంధించిన మ్యాచ్‌లను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే ప్రసారం చేస్తోంది.

ఇక ఐపీఎల్ ఓటీటీ హక్కులు చేజారడం.. టీవీ రైట్స్ మాత్రమే దక్కడంతో స్టార్ స్పోర్ట్స్ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇతర సంస్థల సాయాన్ని కోరుతోంది. తమ వాటాలను విక్రయించేందుకు కూడా సిద్దమైంది. ఈ క్రమంలోనే డిస్నీ హాట్‌స్టార్‌ను జియోసినిమాలో కలిపేయాలని ప్రతిపాధన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, December 12, 2023, 18:16 [IST]
Other articles published on Dec 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+