IND vs AUS:ఆ బ్యూటిఫుల్ మిస్టరీ గర్ల్ ఎవరంటే.?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ ఫైనల్ సందర్భంగా గ్యాలరీలోని ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. టీమిండియా జెర్సీని ధరించి సందడి చేసిన ఈ అమ్మాయిని కెమెరామెన్ పదే పదే టీవీలో చూపించాడు. చేతిలో మొబైల్ ఫోన్‌తో కనిపించిన ఈ సుందరి కుర్రాళ్ల మనసును దోచేసింది.
స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా 32వ ఓవర్‌లో ఈ అమ్మాయి ఒక్కసారిగా బిగ్ స్క్రీన్‌పై కనిపించింది. అందానికి అసూయ పుట్టేలా ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మ్యాచ్ సందర్భంగా ఆ మిస్టరీ గర్ల్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో ఆ అమ్మాయి ఎవరా? అని నెటిజన్లు ఆరా తీసారు. ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోను షేర్ చేసి ఎవరో కనుక్కోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేశారు. చివరికి కొందరు నెటిజన్లు ఆమె ఎవరో గుర్తించారు. ఆమె గేమింగ్ ఔత్సాహికురాలని, పేరు పాయల్ ధారే అని పేర్కొన్నారు. గేమర్స్ అందరికి ఆమె సుపరిచితమేనని కామెంట్ చేశారు.

సోషల్ మీడియా కథనాల ప్రకారం మధ్యప్రదేశ్‌కు చెందిన పాయల్ ధారే.. ఓ గేమర్, స్ట్రీమర్, కంటెంట్ క్రియేటర్ అని, ఆమె యూట్యూబ్ ఛానెల్‌ను 40 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసినట్లు వీడియోలు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. మరోసారి విరాట్ కోహ్లీ(98 బంతుల్లో 5 ఫోర్లతో 84) అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 267 పరుగులు చేసి గెలుపొందింది. సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లతో 45), కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
Vo sab to theek hai per ye hai kon ? 🤔#INDvsAUS pic.twitter.com/ul88jyeHts
— 💗Pooja yadav (@Poojayadav206) March 4, 2025
— Payal Gaming (@Payal_Dhaare) March 4, 2025
Aur ache se dekho Bhai she’s Payal Gaming #INDvsAUS https://t.co/uR0XE47QRG pic.twitter.com/06dCJCglSC
— @Colonel_Kickass (@sudeeptraj) March 4, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications