క్రీడా జర్నలిస్ట్‌లతోనే ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. కేఎస్‌జీ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌ల కష్టాన్ని గుర్తించి, గౌరవించాలన్నారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జేఏటీ) ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు కేఎస్‌జీ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) టీ20 టోర్నీ జరగనుంది.
ఈ టోర్నీలో మొత్తం పది మీడియా సంస్థలకు చెందిన జట్లు తలపడనున్నాయి. ఈ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు శాట్జ్ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం కేఎస్‌జీ సంస్థ చైర్మన్, ఇండి రేసింగ్ టీమ్ ఓనర్ కె.అభిషేక్ రెడ్డి, త్రుక్ష ఫుడ్స్ ఎండీ సీహెచ్. భరత్ రెడ్డి, లైఫ్‌స్పాన్ ప్రతినిధి భరణి 10 జట్ల కెప్టెన్లకు క్యాప్స్ ప్రదానం చేశారు.

ట్రోఫీ ఆవిష్కరణ తర్వాత ఎమ్మెస్కే మాట్లాడుతూ ప్రొఫెషనల్ పద్ధతిలో జర్నలిస్టులు క్రికెట్ ఆడనుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఏ క్రీడలోనైనా వర్ధమాన ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావాలంటే అది క్రీడా జర్నలిస్టులతోనే సాధ్యమవుతుందని చెప్పారు. వారి కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి, గౌరవించాలన్నారు.
శివసేనారెడ్డి మాట్లాడుతూ జేపీఎల్‌తో క్రీడల ప్రాధాన్యత, అవశ్యకతపై ప్రజలకు ఒక మంచి సందేశం వెళ్లనుందన్నారు. ఈ టోర్నీకి శాట్జ్ తరఫున పూర్తి సహాయసహకారలందిస్తామని తెలిపారు. అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. జేపీఎల్ అనే క్రికెట్ టోర్నీ ఆలోచన రావడం గొప్ప విషయమని, తీవ్ర పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఈ లీగ్‌తో కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పారు.

లీగ్‌లో ఆడుతున్న అన్ని జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భరత్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ హితం కోరే జర్నలిస్టులందరూ ఇలా ఒకే వేదికపై కలిసి, లీగ్‌లో ఆడనుండడం కనులపండుగగా ఉందన్నారు. భరణి మాట్లాడుతూ జేపీఎల్‌లో జర్నలిస్టులందరూ రాణించాలని, లీగ్ విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్త పత్రికలు, చానెళ్ల నుంచి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.