రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేసిందే నేనే: ఎమ్మెస్కే ప్రసాద్

నాగ్‌పూర్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై సెంచరీ చేయడం ఆశమాషీ వ్యవహారం కాదని, ఈ తరహా వికెట్లపై ఎలా బ్యాటింగ్ చేయాలో రోహిత్ అందరికి సూచాంచాడని తెలిపాడు. ఇక రోహిత్ శర్మ సెంచరీలో తమకు కూడా క్రెడిట్ ఇవ్వాలని, అతన్ని ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది తన సారథ్యంలోని సెలెక్షన్ కమిటీనే అని గుర్తు చేశాడు.

మాకు క్రెడిట్ ఇవ్వాలి..
తొలి టెస్ట్ రెండో రోజు ఆట అనంతరం స్టార్ స్పోర్ట్స్ తెలుగు పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌లో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'రోహిత్ శర్మ సెంచరీలో మాకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.
మా సెలెక్షన్ కమిటీనే అతన్ని ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. ఆ సమయంలో టెస్ట్ ఓపెనర్లుగా పృథ్వీ షా, మురళీ విజయ్ తడబడుతుండటం... మరోవైపు పుజారా, రహానే, కోహ్లీలతో మిడిలార్డర్ బలంగా ఉండటంతో మా సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మను ఓపెనర్‌గా ఆడిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేసింది.

మిడిలార్డర్ బలంగా ఉండటంతో..
వెంటనే అప్పటి కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో పాటు రోహిత్ శర్మతో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఓపెనర్‌గా ఆడుతావా? అని రోహిత్‌ను కోరగా.. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్దమని చెప్పాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ అదరగొట్టాడు.
ఆ సిరీస్‌లో 500 ప్లస్ పరుగులు చేసి భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తున్నాడు.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

రోహిత్ శర్మ సెంచరీ..
ఇక 77/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో టీమిండియా రెండో రోజు ఆటను కొనసాగించగా.. రోహిత్ శర్మ(212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 120) సెంచరీతో చెలరేగాడు. ఓవైపు బ్యాటర్లంతా విఫలమవ్వగా.. మరోవైపు అసాధారణ ఆటతీరుతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా(170 బంతుల్లో 9 ఫోర్లతో 66 బ్యాటింగ్), అక్షర్ పటేల్(102 బంతుల్లో 8 ఫోర్లతో 52 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు.
దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 114 ఓవర్లలో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ముర్ఫీ(5/82) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. నాథన్ లియోన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం భారత్‌కు 144 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications