
న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలని చెప్పింది తానేనని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. తన హయాంలోనే రోహిత్ ఓపెనర్‌గా అవకాశం అందుకొని సత్తాచాటాడని ఈ తెలుగు కామెంటేటర్ గుర్తు చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఎలా నిలదొక్కుకున్నాడనే విషయాన్ని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు. వన్డేల్లో స్థానం కోసం ఇబ్బంది పడినట్లే.. టెస్టుల్లోనూ కష్టాలను ఎదుర్కొన్నాడని వెల్లడించాడు. హిట్‌మ్యాన్ కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులను చవిచూశాడని గుర్తుచేసుకున్నాడు. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెస్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'రోహిత్ టెస్ట్ కెరీర్ అప్స్ అండ్ డౌన్‌గా సాగింది. కానీ వన్డే కెరీర్ మాత్రం అద్భుతంగా సాగింది. ముఖ్యంగా 2016-17 సీజన్ తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. పరిమిత ఓవర్లలో అతను దుమ్ములేపాడు. 2019 ప్రపంచకప్ తర్వాత అతనిపై చాలా నమ్మకం వచ్చింది. మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, పుజారా, విహారి, రహానెలు రాణిస్తుండటంతో రోహిత్‌ను ఓపెనర్‌గా ఆడించాలనుకున్నాం. మురళీ విజయ్ స్థానంలో అతను రాణించగలడని భావించాం. సౌతాఫ్రికా పర్యటనలో ఓపెనర్‌గా బరోలోకి దించాడు.
ఫస్ట్ టెస్ట్‌లోనే 176, 127 పరుగులు చేశాడు. ఆ తర్వాత తెలిసిందే. అయితే రోహిత్‌ను ఓపెనర్‌గా ఆడించాలనే విషయంపై నేను కోహ్లీ, రవిశాస్త్రిలతో మాట్లాడాను. ముగ్గరం కలిసి అతన్ని ఓపెనర్‌గా ప్రమోట్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఆ అవకాశాలను రోహిత్ రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. అద్భుతమైన డబుల్ సెంచరీతో తానేంటో నిరూపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో రాణిస్తే కంప్లీట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందుతారు. టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా అవకాశం వచ్చినందుకు రోహిత్ చాలా సంతోషించాడు'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
తన కెరీర్‌లో ఇప్పటి వరకు 38 టెస్ట్‌లు ఆడిన రోహిత్ 46.69 సగటుతో 2615 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రోహిత్.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సమయాత్తం అవుతున్నాడు.