
పెద్ద వివాదం..
'రిషభ్ పంత్‌ను అప్పట్లో టెస్టుల్లోకి ఎంపిక చేయగానే పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. చాలా మంది పంత్ టెస్టులకు పనికిరాడని, అతని దూకుడు టెస్ట్ ఫార్మాట్‌కు సరిపోదని, కీపింగ్ విషయంలో ఫిట్‌నెస్ విషయంలో అలక్ష్యంగా ఉంటాడని విమర్శలు గుప్పించారు. కానీ పంత్ వాటికి తన ఆటతోనే బదులిచ్చాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పంత్ ఘోరంగా విఫలమయినా.. ఆస్ట్రేలియా గడ్డపై తిరుగులేని ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పైనా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు.

సూపర్ కీపింగ్..
భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లపై సైతం చక్కగా కీపింగ్ చేస్తున్నాడు. చాలెంజింగ్ కండీషన్లలో కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. సెలెక్టర్‌గా ప్రతిభని గుర్తించడం నా బాధ్యత. ఆ క్రమంలోనే పంత్‌ను టెస్ట్‌లకు ఎంపిక చేశాం. మా నమ్మకాన్ని పంత్ వమ్ము చేయలేదు. రెండేళ్ల కిందట చాలా మంది పంత్ ఈ స్థాయిలో రాణిస్తాడని ఊహించలేదు. అతన్ని విమర్శించిన వారే నేడు ప్రశంసలు కురిపిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా పంత్ కీలకం అవుతాడు. అతను ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు.'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్దరూ ఆడాల్సిందే..
ఈ మెగా ఫైనల్లో కోహ్లీసేన.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరితో బరిలో దిగాల్సిందేనన్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో జడేజా, అశ్విన్ సూపర్ ఫామ్ కలిసొస్తుందన్నాడు. 'నా అభిప్రాయప్రకారం ఇద్దరు స్పిన్నర్లు ఆడాల్సిందే. ఒకవేళ హార్దిక్ పాండ్యా గనుక జట్టులో ఉండి ఉంటే.. అక్కడి పరిస్థితులు అతనికి కలిసొచ్చేవి. అప్పడు నేను ఒకే స్పిన్నర్‌తో ఆడాలని చెప్పేవాడిని. పాండ్యా లేడు కాబట్టి రవీంద్ర జడేజాను బ్యాట్స్‌మన్‌గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే అతను మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. అతనో కంప్లీట్ ప్యాకెజ్'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

బిగ్ బ్లండర్..
అంతేకాకుండా అశ్విన్ పక్కనపెడితే పెద్ద తప్పిదమవుతుందన్నాడు. 'అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోకుంటే పెద్ద తప్పిదం అవుతుంది. అక్కడి పరిస్థితులు భిన్నమైనవి అనే విషయం నాకు తెలుసు. కానీ అనుభవం, ఫామ్ దృష్ట్యా అశ్విన్‌ను తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి.'అని ఎమ్మెస్కే సూచించాడు. ఇక 2016 నుంచి 2020 వరకు చీఫ్ సెలెక్టెర్‌గా పని చేసిన ఎమ్మెస్కే.. ప్రస్తుతం తెలుగు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. జూన్ 18-23 వరకు సౌతాంప్టన్ వేదికగా జరిగే డబ్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.


Click it and Unblock the Notifications












