Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MSK Prasad: మహమ్మద్ షమీ బజాజ్ చెతక్‌ లాంటోడు.. స్టార్ట్ అయ్యాడా? అంటే..

 MSK Prasad says Mohammed Shami Is Like Bajaj Chetak Once He Starts Then Unstoppable

సెంచూరియన్: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీపై మాజీ చీఫ్ సెలెక్టర్, ప్రముఖ తెలుగు కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించాడు. షమీ బజాజ్ చెతక్ లాంటోడని, ఒక్కసారి స్టార్ట్ అయ్యాడా? అంటే దూసుకెళ్తాడని కొనియాడాడు. భారత్- సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు తెలుగు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెస్కే ప్రసాద్.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బ్రేక్‌లో మహమ్మద్ షమీ బౌలింగ్‌ను విశ్లేషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. లంచ్ బ్రేక్ ముందు షమీ బౌలింగ్ అంత ప్రభావ వంతంగా కనిపించడంతో ఎమ్మెస్కే ఈ కామెంట్స్ చేశాడు.

బజాజ్ స్కూటర్‌లా..

బజాజ్ స్కూటర్‌లా..

'మహమ్మద్ షమీ బజాజ్ చెతక్ లాంటోడు. స్టార్ట్ అయ్యే వరకే సమస్య. రిథమ్ అందుకున్నాడో అతన్ని అడ్డుకోవడం కష్టం. ఈ క్రమంలోనే అతను ఎక్కువగా సెకండ్ ఇన్నింగ్స్‌ల్లో ప్రభావం చూపిస్తుంటాడు. అందుకే అతన్ని సెకండ్ ఇన్నింగ్స్ బౌలరని పిలుస్తారు. బజాజ్ స్కూటర్‌లానే కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లమ్. స్టార్ట్ అయ్యిందా అంటే బజాజ్ స్కూటర్‌ ఎలా దూసుకెళ్తుందో అలా విజృంభిస్తాడు'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక ఎమ్మెస్కే వ్యాఖ్యలతో స్టూడియోలో నవ్వులు పూసాయి. ఇక ఎమ్మెస్కే చెప్పినట్లే మహమ్మద్ షమీ బ్రేక్ అనంతరం విజృంభించాడు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసాడు.

 రెండు కీలక వికెట్లు..

రెండు కీలక వికెట్లు..

కెగన్ పీటర్సన్(15), ఎయిడెన్ మార్క్‌రమ్(13)‌లను సూపర్ బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. షమీ వేసిన ఈ బంతులకు పూర్తిగా తడబడిన బ్యాట్స్‌మన్ కట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అతని సూపర్ బౌలింగ్‌కు బిత్తరపోయారు. ఇక షమీ బౌలింగ్ వేస్తున్నప్పుడు కూడా సహచర కామెంటేటర్లు కళ్యాణ్ కృష్ణ, సుమన్ మరోసారి ఎమ్మెస్కే వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. షమీ బౌలింగ్‌ను ఎమ్మెస్కే సూపర్బ్‌గా వివరించారని, ఆయన చెప్పినట్లే షమీ బజాజ్ స్కూటర్‌లా దూసుకెళ్తున్నాడని కొనియాడారు. క్రీజులో పాతుకుపోతున్న వియాన్ ముల్డర్(12)ను కూడా

6 వికెట్లు కోల్పోయిన సఫారీ

6 వికెట్లు కోల్పోయిన సఫారీ

మహమ్మద్ షమీతో పాటు మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా తలో వికెట్ తీయడంతో సౌతాఫ్రికా 104 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత పేసర్ల ధాటికీ

32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సౌతాఫ్రికాను బవుమా, డికాక్ ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడిని శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. డికాక్‌(34)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ముల్డర్‌తో బవుమా పొరాడే ప్రయత్నం చేసినప్పటికీ షమీ మరోసారి దెబ్బతీసాడు. ముల్డర్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో బవుమాతో పాటు(48 బ్యాటింగ్), మార్కో జాన్సెన్(2 బ్యాటింగ్) ఉన్నారు.

55 పరుగులకే 7 వికెట్లు..

55 పరుగులకే 7 వికెట్లు..

272/3 ఓవర్‌ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 327 పరుగులకు ఆలౌటైంది. పిచ్‌పై ఉన్న తేమను అందిపుచ్చుకున్న సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబడా(3/72), లుంగి ఎంగిడి(6/71) భారత్ పతనాన్ని శాసించాడు. దాంతో 55 పరుగుల వ్యవధిలోనే భారత్ మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో కేఎల్ రాహుల్(260 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 123)‌, అజింక్యా రహానే (102 బంతుల్లో 9 ఫోర్లతో 48)‌ వెనువెంటనే ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. రవిచంద్రన్ అశ్విన్(4), రిషభ్ పంత్(8)తో పాటు శార్దూల్ ఠాకూర్(4), మహమ్మద్ షమీ(4), జస్‌ప్రీత్ బుమ్రా(14) వరుసగా ఔటయ్యారు. సిరాజ్(4 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

Story first published: Tuesday, December 28, 2021, 19:46 [IST]
Other articles published on Dec 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+