టీమిండియా మళ్లీ గెలుపు బాట పట్టాలంటే జట్టులోకి అతను రావాలి: మాజీ చీఫ్ సెలెక్టర్

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టాలంటే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రావాలని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. బుమ్రా చేరికతోనే టీమ్ బౌలింగ్ బలం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. గత మంగళవారం ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా బౌలింగ్ వైఫల్యం కారణంగానే 208 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే బౌలర్లు లేకపోవడం టీమిండియా పరాజయానికి కారణం అవుతోంది. ఈ క్రమంలోనే జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రావాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బుమ్రా వస్తేనే..
నాగ్‌పూర్ వేదికగా మరికొద్దిసేపట్లో రెండో టీ20 మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు BelieveInBlue షోలో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. జట్టులో బుమ్రా ఎంత కీలకమో వివరించాడు. 'ఆసియా కప్ 2022లో భారత వైఫల్యానికి ప్రధాన కారణం కూడా జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడమే. వికెట్ తీసే బౌలర్ లేకపోవడమే ఆ టోర్నీలో ఓటమిపాలయ్యాం. భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే జస్‌ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో చెలరేగుతాడు. మిడిల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ చేసే వాళ్లు లేరు.

కోహ్లీ సెంచరీ చేసినంత..
అర్ష్‌దీప్ సింగ్ రాణించినా మిగతావాళ్లు విఫలమయ్యారు. కాబట్టి బుమ్రా జట్టులోకి రావడం జట్టుకు పెద్ద బలం. బుమ్రా స్ట్రైక్‌రేట్ కంటే పవర్ ప్లే, మిడిల్ ఓవర్లతో పాటు డెత్ ఓవర్లలో రాణించగలడు. అతన్ని మించిన బెస్ట్ డెత్ బౌలర్ లేడు. అతను జట్టులోకి రావడం ఎంత శుభ పరిణామం అంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు ఎంజాయ్ చేసింత మంచి విషయం'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

పంత్‌కు అవకాశం దక్కెనా?
సిరీస్‌పై ఆశలు నిలవాలంటే నేడు జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరి ఈ మ్యాచ్‌కు జట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్‌కు అవకాశం కల్పిస్తారా? ఆసీస్‌తో తొలి టీ20లో దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నా ఆకట్టుకోలేకపోయాడు. కీపింగ్‌లో పెద్దగా మాయ చేయని కార్తీక్.. బ్యాటింగ్‌లోనూ విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులకే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో రెండో టీ20లో అతడి స్థానంలో పంత్‌ను తీసుకోవాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఉమేశ్ ఔట్..
ఇక, గత మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యం ప్రధానంగా కన్పించింది. ముఖ్యంగా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో అతడిని పక్కన పెట్టాలనే అభిప్రాయాలున్నాయి. ఇటీవలే ఫిట్‌నెస్ సాధించిన బుమ్రా తిరిగి జట్టులోకి రావొచ్చు. ఈ విషయాన్ని రోహిత్ కూడా సూచనప్రాయంగా చెప్పాడు. అయితే బుమ్రాను ఉమేశ్ స్థానంలో తీసుకునే అవకాశాలున్నాయి. ఇవి మినహా పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications