
ముఖాలు చూసుకోకుండా..
తాజాగా ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తెలుగు మాజీ క్రికెటర్ ఆ విమర్శలపై స్పందించాడు. చీఫ్ సెలెక్టర్‌గా కోచ్, కెప్టెన్‌తో ఎలాంటి వాదనలు జరిగేవో చెప్పుకొచ్చాడు. 'మా మధ్య ఎలాంటి వాదనలు జరిగేవో కోహ్లీ, శాస్త్రిని ఓసారి అడగండి. కొన్నిసార్లు అయితే ఒకరి ముఖాలు మరొకరు చూసుకోకుండా మాటలు అనుకునేవాళ్లం. కానీ వారిలో గొప్ప విషయం ఏంటంటే మరుసటి రోజు మేం మళ్లీ కలుసుకున్నప్పుడు.. సాధారణంగానే పలకరించేవారు. అంతేకాకుండా మా వాదనల్లోని మెరిట్ పాయింట్‌పై ఏకాభిప్రాయానికి వచ్చేవాళ్లం. ఓ మేనేజ్‌మెంట్ విద్యార్థిగా నాకు వీటిని ఎలా సమన్వయం చేయాలో బాగా తెలుసు.

వాళ్లను అడిగినా..
ఇక నేను కొంతమందిని బహిరంగంగా బ్లేమ్ చేయాలని ప్రజలు అనుకున్నారు. అయినా నేను ఆ పనెందుకు చేస్తా. ఎందుకంటే అది నా కుటుంబం. నా ఇంట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంతమాత్రానా నేను బయటకు వచ్చి చెబుతానా? మా మాధ్య ఎలాంటి వాదోపవాదనలు నడిచేవో, వాటిని ఎలా ఉపయోగించుకునే వాళ్లమో విరాట్, రవినే చెబుతారు. బహిరంగంగా మా మధ్య బేధాభిప్రాయాలు లేకుంటే.. అన్నిటికి నేను తలూపినట్లు కాదు. అనేక విషయాల్లో వారిని నేనెలా కన్విన్స్ చేశానో ఎవరికి తెలుసు.'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

ఇద్దరూ ఆడాల్సిందే..
టీమిండియా తదుపరి అసైన్‌మెంట్ అయిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో ఎమ్మెస్కే పలు సూచనలు చేశాడు. ఈ మెగా ఫైనల్లో కోహ్లీసేన.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరితో బరిలో దిగాల్సిందేనన్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో జడేజా, అశ్విన్ సూపర్ ఫామ్ కలిసొస్తుందన్నాడు. 'నా అభిప్రాయప్రకారం ఇద్దరు స్పిన్నర్లు ఆడాల్సిందే.
ఒకవేళ హార్దిక్ పాండ్యా గనుక జట్టులో ఉండి ఉంటే.. అక్కడి పరిస్థితులు అతనికి కలిసొచ్చేవి. అప్పడు నేను ఒకే స్పిన్నర్‌తో ఆడాలని చెప్పేవాడిని. పాండ్యా లేడు కాబట్టి రవీంద్ర జడేజాను బ్యాట్స్‌మన్‌గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే అతను మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. అతనో కంప్లీట్ ప్యాకెజ్'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

పెద్ద తప్పిదం..
అంతేకాకుండా అశ్విన్ పక్కనపెడితే పెద్ద తప్పిదమవుతుందన్నాడు. 'అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోకుంటే పెద్ద తప్పిదం అవుతుంది. అక్కడి పరిస్థితులు భిన్నమైనవి అనే విషయం నాకు తెలుసు. కానీ అనుభవం, ఫామ్ దృష్ట్యా అశ్విన్‌ను తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి.'అని ఎమ్మెస్కే సూచించాడు. ఇక 2016 నుంచి 2020 వరకు చీఫ్ సెలెక్టెర్‌గా పని చేసిన ఎమ్మెస్కే.. ప్రస్తుతం తెలుగు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












